
ముంబై: పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులే కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. నీలిచిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసుల దగ్గర వెల్లడించడంతో కుంద్రా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఆయన ఉంటారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులోఆదివారం నాడు టెలివిజన్ నటి, మోడల్ గెహానా వశిష్ట్‌తో పాటుగా మరో ఇద్దరిని ముంబై పోలీసులు సమన్లు పంపినప్పటికీ వారు విచారణకు హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment