Raj Kundra Case: Shilpa Shettys First Post After Raj Kundras Arrest - Sakshi
Sakshi News home page

Shilpa Shetty : 'అదృష్టవశాత్తూ నేను ఇంకా బతికే ఉన్నాను'

Published Fri, Jul 23 2021 3:03 PM | Last Updated on Fri, Jul 23 2021 7:06 PM

Shilpa Shettys First Post After Raj Kundras Arrest - Sakshi

ముంబై : అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే భర్త అరెస్ట్‌ అయిన తర్వాత ఇప్పటివరకు మాట్లాడని శిల్పాశెట్టి ..తొలిసారి సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. 'కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తుతను చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.


గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను జీవిస్తాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు' అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వాక్యాలను శిల్పా హైలేట్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శిల్పా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్  మిలింద్ భరంబే విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 


కాగా రాజ్‌కుంద్రా 2009లో శిల్పాశెట్టిని రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు బిజినెస్‌మెన్‌ కూతురు కవితను వివాహం చేసుకున్న ఆయన 2006లో ఆమెతో విడాకులు తీసుకున్నారు.  వీరికి ఓ కుమార్తె డీలేనా ఉంది. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రాజ్‌కుంద్రా ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్‌-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. వివాదాలతో రాజ్‌కుంద్రా పేరు మసకబారింది. ఇప్పుడు నీలి చిత్రాల వ్యవహారంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. భర్త వైఖరిపై తన నిర్ణయం స్పష్టంగా చెప్పకపోయినా రాజ్‌కుంద్రాకు శిల్పా అండగా నిలబడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement