అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాకు ఊరట!! | Porn Film Racket Case: Supreme Court Relief To Raj kundra | Sakshi
Sakshi News home page

అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాకు ఊరట!!

Published Wed, Dec 15 2021 1:46 PM | Last Updated on Wed, Dec 15 2021 2:32 PM

Porn Film Racket Case: Supreme Court Relief To Raj kundra  - Sakshi

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో సుప్రీంకోర్టు నుంచి కాస్త ఊరట లభించింది. అంతేకాదు సుప్రీంకోర్టు రాజ్‌కుంద్రాకు అరెస్టు కాకుండా నాలుగు వారాల బెయిల్‌ని మంజూరు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే నవంబర్ 25న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం రాజ్‌ కుంద్రా దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

(చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..)

ఈ క్రమంలో కుంద్రా వీడియోలు శృంగారభరితమైనవే అయినప్పటికీ, వాస్తవానికి ఎటువంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలను చూపించలేదని హైకోర్టులో పిటిషన్‌లో పేర్కొన్నారు. పైగా తాను అటువంటి వీడియోల తయారీలో లేదా ప్రసారంలో పాల్గొనలేదని చెప్పడమే కాక తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని అన్నారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement