
Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తి ఉన్నవారికి ఆఫర్ల ఆశ చూపించి, బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశాడన్నది రాజ్‌కుంద్రాపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ నెల 19న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు హాట్‌షాట్స్ యాప్‌లో పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేసేవాడని తెలిసింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క హాట్ షాట్స్ యాప్ ద్వారానే అతడు రూ.1.17 కోట్లు ఆర్జించాడని జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఆదాయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం రాబట్టడానికి ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి పూర్తి వివరాలను కోరామని ముంబై పోలీసులు వెల్లడించారు.
కాగా రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు కొట్టివేసింది. నిందితుడికి 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని నిందితుడి తరపు న్యాయవాది పేర్కొన్నాడు. ఇదిలా వుంటే రాజ్ కుంద్రా ఆఫీసు మీద పోలీసులు రైడ్ చేసినప్పుడు రహస్య కప్‌బోర్డులను గుర్తించారు. వీటిలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. కానీ రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసేనాటికే అక్కడ చాలామటుకు డిజిటల్ సమాచారాన్ని డిలీట్ చేశారని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment