
ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు కోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం నాడు బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో అతడు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇదిలా వుంటే అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్‌కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నారు. స్టోరేజ్ ఏరియా నెట్‌వర్క్ నుంచి 51 అడల్ట్ సినిమాలు, అతడి దగ్గర పని చేసే రాజ్, ర్యాన్‌ల ల్యాప్‌ట్యాప్స్‌లో 68 అశ్లీల చిత్రాలను పోలీసులు సేకరించారు. తన అరెస్ట్‌ను ముందే ఊహించిన రాజ్ కుంద్రా కొంతమేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక జూలై 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దర్శకుడు సౌరభ్ కుశ్వాహ, నటి షెర్లిన్ చోప్రాను సైతం పోలీసులు విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment