
Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్‌లో తన బంధువులతో కలిసి రాజ్ కుంద్రా నీలి చిత్రాల దందా చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్, ఈ మెయిల్ ద్వారా ఈ చీకటి వ్యవహారం గుట్టును బయటపెట్టారు.
బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్‌లలో అప్‌లోడ్ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీలో ఉంచనున్నారు.ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసునమోదైందని ముంబై పోలీసు కమిషనర్‌హేమంత్ నాగ్రాలే ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment