Raj Kundra Says Being Made a Scapegoat in Pornography Case - Sakshi
Sakshi News home page

Raj Kundra Case: ఈ కేసులో నన్ను బలి పశువుని చేశారు: కోర్టులో రాజ్‌కుంద్రా వాదన

Published Thu, Aug 25 2022 6:38 PM | Last Updated on Thu, Aug 25 2022 8:48 PM

Raj Kundra Says Being Made a Scapegoat in Pornography Case - Sakshi

పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలో తాను బలిపశువునయ్యానని రాజ్ కుంద్రా వాపోయాడు. ఈ కేసులో ఏ ఒక్క మహిళా తనకు వ్యతిరేకంగా చెప్పలేదన్నారు. దర్యాప్తు సంస్థ కూడా ఏ ఒక్క ఆధారాన్ని సాక్ష్యాలతో నిరూపించలేకపోయిందని చెప్పాడు. తనపై మోపిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా రాజ్‌కుంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్‌

అభియోగపత్రంలో కానీ, సప్లిమెంటరీ చార్జీషీట్‌లో ఏ ఒక్క మహిళ కూడా తనను కుంద్రా బెదిరించాడని, బలవంతం పెట్టడాని కానీ, వీడియో తీసినట్టు చెప్పలేదని పటిషన్‌లో పేర్కొన్నాడు. ఇక తాను రాహస్యంగా ఎటువంటి కంటెంట్‌ను సృష్టించలేదని, తాను అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, అప్‌లోడ్‌ చేయడం కానీ చేయలేదన్నాడు. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు తమ చార్జీషీట్‌లో పేర్కొన్నారు. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని రాజ్‌కుంద్రా కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇప్పటికే రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్, షెర్లిన్ చోప్రా తదితరులను విచారించిన సంగతి తెలిసిందే.

చదవండి: అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్‌ క్లాస్ డైరీస్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement