
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు జులై 23 వరకు పోలీస్ కస్టడీకి విధించింది కోర్టు. నీలి చిత్రాల వ్యవహారంలో కీలక ఆరోపణలతో కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కుంద్రాను మంగళవారం ముంబైలోని ఎస్‌ప్లాన్డే కోర్టు ముందు హాజరు పరిచారు. కుంద్రా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిలోని విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఇంకా అతని వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసులో కుంద్రా నిన్న అరెస్టు చేయగా, ర్యాన్ థార్ప్‌ను ఈ రోజు అరెస్టు చేశారు. కొన్ని యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసునమోదైందని ముంబై పోలీసు కమిషనర్‌హేమంత్ నాగ్రాలే ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కుంద్రా ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్నామనీ, దీనికి సంబంధించి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra and one Ryan Tharp brought to Mumbai's Esplanade Court.
Kundra was arrested yesterday while Tharp was arrested today in connection with a case relating to the production of pornographic films. pic.twitter.com/NCpbVeKhJH
— ANI (@ANI) July 20, 2021
Comments
Please login to add a commentAdd a comment