
వియాన్ రాజ్‌కుంద్రా
అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’గా ప్రభాస్ ఫేమస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. అయితే.. ఇప్పుడీ ‘బాహుబలి’ ప్రస్తావన ఎందుకంటే... కొత్తగా చైర్‌బలి పేరుతో వియాన్ రాజ్‌కుంద్రా నెట్టింట్లో షికారు చేస్తున్నారు. ప్రముఖ హిందీ నటి శిల్పాశెట్టి కుమారుడే ఈ రాజ్ కుంద్రా.
టీవీలో ‘బాహుబలి’ సినిమాను చూస్తూ ఫస్ట్ సాంగ్‌లో వచ్చే ఓ సీన్‌ను సరదాగా ఇమిటేట్ చేశారు రాజ్‌కుంద్రా. ఈ వీడియాను షేర్ చేశారు శిల్పాశెట్టి. ‘‘బాహుబలి’ సినిమా ముందు చైర్‌బలి ఉన్నాడు. ఈ యాక్టింగ్ స్కిల్స్ వాళ్ల అమ్మ (శిల్పాశెట్టి) దగ్గర్నుంచి వచ్చి ఉంటాయి’’ అని పేర్కొన్నారు రాజ్ కుంద్రా. 2009లో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను శిల్పాశెట్టి వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 2012లో వీరిద్దరికీ కలిగిన సంతానమే వియాన్ రాజ్‌కుంద్రా.
Comments
Please login to add a commentAdd a comment