Raj Kundra Case: Sagarika Shona Claims Raj Kundra Offered Her Web Series - Sakshi
Sakshi News home page

Raj Kundra Arrested: వీడియో కాల్‌లో నగ్నంగా ఆడిషన్‌! షాకైన నటి

Published Tue, Jul 20 2021 12:39 PM | Last Updated on Tue, Jul 20 2021 1:57 PM

Raj Kundra Asked For An Clothless Audition From Actress Sagarika Shona - Sakshi

రాజ్‌ కుంద్రా నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్‌ ఇప్పిస్తానని, వీడియో కాల్‌లో ఆడిషన్‌ అని చెప్పారు, కానీ నగ్నంగా ఆడిషన్‌లో పాల్గొనమన్నారు...

Actress Sagarika Shona: ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టవడం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లో అవకాశాల పేరిట యువతులను ట్రాప్‌లోకి దించి వారితో బలవంతంగా పోర్న్‌ సినిమాలు తీయించాడంటూ అతడి మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మోడల్‌, నటి సాగరిక సోనా సుమన్‌ ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది. 

"నేను మోడల్‌ను. మూడు నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నా. గతేడాది ఆగస్టులో ఉమేశ్‌ కామత్‌ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. రాజ్‌ కుంద్రా నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్‌ ఇప్పిస్తానని చెప్పాడు. ఇంతకీ రాజ్‌ కుంద్రా ఎవరని అడిగితే అతడు శిల్పాశెట్టి భర్త అని పేర్కొన్నాడు."

"నేను ఆ వెబ్‌సిరీస్‌లో నటిస్తే మున్ముందు కూడా మంచి అవకాశాలు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకుంటానని ఎంతో గొప్పగా చెప్పడంతో నేను సరే అన్నాను. అయితే ముందుగా ఆడిషన్‌ ఉంటుందని, కోవిడ్‌ టైం కాబట్టి వీడియో కాల్‌ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పాడు. ఇక వీడియో కాల్‌లో జాయిన్‌ అయ్యాక అతడు నగ్నంగా ఆడిషన్‌లో పాల్గొనమన్నాడు. ఒక్కసారిగా షాకైన నేను వెంటనే అతడికి కుదరదని తేల్చి చెప్పాను"


"అప్పుడు వీడియో కాల్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు, కానీ అతడే రాజ్‌కుంద్రా అనుకుంటున్నా. నిజంగా అతడు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేసి, ఈ రాకెట్‌ గుట్టు రట్టు చేయాలని కోరుకుంటున్నా" అని సాగరిక పేర్కొంది. కాగా రాజ్‌కుంద్రా ఆఫీసు నుంచి పోర్న్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేయడంలో ఉమేశ్‌ కామత్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే బలమైన ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement