
శిల్పా శెట్టి ఫైల్ ఫోటో
ధడ్‌కన్, బాజీగర్, రిష్తే, ఫిర్ మిలేంగే వంటి హిట్ చిత్రాలలో నటించి ఉత్తమ కథానాయికగా అవార్డు అందుకున్న నటి ‘శిల్పా శెట్టి’. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎంతో సంతోషంగా తన వ్యక్తిగత జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. కానీ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోవడానికి కంటే ముందే, శిల్పా శెట్టికి కూడా ఓ గుండె పగిలే ప్రేమ కథ ఉందట. కేవలం బెట్‌లో గెలవడం కోసం ఓ అబ్బాయి తనతో రిలేషన్‌షిప్ పెట్టుకుని, ఆ తర్వాత తన హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, తనను వీడి వెళ్లిపోయినట్టు శిల్పా శెట్టి చెప్పారు.
‘నా స్నేహితులు ఆ అబ్బాయితో బెట్ కట్టారు. దమ్ముంటే నాతో సంబంధం ప్రారంభించాలన్నారు. ఇది అచ్చం ఓ సినిమాలా ఉంది కదా. కానీ ఇదే నిజం. ఆ అబ్బాయి ప్రతి రోజూ మా ఇంటికి ఫోన్ చేసేవాడు. అప్పుడు నేను కాలేజీ స్టూడెంట్. ఆ వయసులో ఏ అమ్మాయి ఆకర్షితురాలు అవ్వదో చెప్పండి. నేను అంతే. అప్పుడు మాకు కేవలం ల్యాండ్‌లైన్ మాత్రమే ఉండేది. అతడి ఫోన్ కోసం ప్రతి రోజు సాయంత్రం ఎదురుచూసేదాన్ని. మా నాన్న ఇంటికి వస్తే.. ఫోన్ కట్ చేసేదాన్ని. కానీ ఆ అబ్బాయి తన పేరు కూడా చెప్పలేదు. అలా ఓ మూడు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగింది మా డేటింగ్. ఓ రోజు బస్టాపులో కలుద్దాం అన్నాడు. కానీ రాలేదు. ఆ సమయంలో నేను బ్రేకప్ చెప్పాలనుకున్నా. కానీ ఆ తర్వాత తెలిసింది. కేవలం బెట్‌లో నెగ్గడం కోసమే నాతో రిలేషన్‌షిప్ కొనసాగించినట్టు. ఆ అబ్బాయి నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. దానిని వర్ణించలేను. కానీ నా హృదయం ఒక్కసారిగా ముక్కలైంది’ అని శిల్పా శెట్టి చెప్పారు. చివరికి అంతా మంచే జరిగిందని శిల్పా అన్నారు. రాజ్‌ను కలిసిన అంతా నాకు సంతోషం దొరికిందని చెప్పారు. రాజ్ చాలా రొమాంటిక్ అంటూ కూడా చెప్పుకొచ్చారు.