ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు | Shilpa's name dragged in business row to create hype: Raj Kundra | Sakshi
Sakshi News home page

ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు

Published Fri, Apr 28 2017 4:16 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు - Sakshi

ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు

ముంబై: మీడియాలో ప్రచారం పొందడానికే బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిపై క్రిమినల్‌ కేసు పెట్టారని ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా ఆరోపించారు. తమపై కేసు పెట్టిన ఓ టెక్స్‌టైల్స్‌ సంస్థ యజమాని పలు చోట్ల తన పరిచయాలను దుర్వినియోగం చేశాడని కుంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు తనకు 24 లక్షల రూపాయలు మోసం చేశారని టెక్స్‌టైల్స్ సంస్థ యజమాని వారిపై క్రిమినల్‌ కేసు పెట్టారు. మహారాష్ట్రలోని థానెలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాను మోసం చేయలేదని, ఈ వ్యవహారం సివిల్‌ విషయమని, ఆయనతో చేసుకున్న వ్యాపార ఒప్పందం రద్దయ్యిందని కుంద్రా చెప్పారు. ఈ వ్యాపార లావాదేవీల్లో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. మీడియాలో ప్రచారం పొందేందుకు ఆమె పేరును ఈ కేసులోకి లాగారని కుంద్రా ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement