'అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా' | Shilpa Shetty Beats Up Husband Raj Kundra Became Viral | Sakshi
Sakshi News home page

'అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా'

Published Thu, May 14 2020 12:22 PM | Last Updated on Thu, May 14 2020 12:57 PM

Shilpa Shetty Beats Up Husband Raj Kundra Became Viral - Sakshi

ముంబై : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉండడంతో బాలీవుడ్‌ నటీమణులు టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తన భర్త రాజకుంద్రా, కొడుకు వియాన్‌తో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో శిల్పా శెట్టి డ్యుయల్‌ రోల్‌ అంటే ఒక రోల్‌లో రాజ్‌కుంద్రా భార్య లాగా, మరొక రోల్‌ ఇంటి పనిమనిషిగా కనిపించి ఆకట్టుకుంటారు. శిల్పాశెట్టి పార్టీవేర్‌కు సంబంధించిన డ్రెస్‌ను సెలెక్ట్‌ చేస్తున్న సన్నివేశంతో వీడియో మొదలవుతుంది. ఇంతలో తన భర్త రాజ్‌ కుంద్రా శిల్పాను ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆమె వద్దని వారించడంతో మిన్నకుండిపోతాడు. ఇంతలో సీన్‌లోకి పని మనిషి రూపంలో ఉన్న శిల్పాశెట్టి ప్రవేశిస్తుంది. పనిలో ఉన్నపు​డు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే చిరాకు కలుగుతుంది.. అలా ప్రవర్తించిన వారిని కొట్టాలన్నంత కోపం వస్తుంది. వెంటనే ఇది విన్న శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాను కొట్టడం ప్రారంభిస్తుంది. . ' నేను సీరియస్‌గా ఒక పని చేస్తుంటే నా భర్త ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అందుకే అతని​ కొట్టాల్సి వచ్చింది. అయినా నేను కొట్టింది నా భర్తనే కదా' అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement