
Shilpa Shetty And Raj Kundra Marriage Anniversary: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఆరోపణలు, వివాదాల నడుమ వారికి నేడు సంతోషకరమైన రోజు కానుంది. నవంబర్ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్‌ను పోస్ట్ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.
ఈ అందమైన ఫొటోలతో పాటు '12 ఏళ్ల క్రితం ఈ క్షణం, ఈ రోజు మేము ఒక వాగ్దానం చేశాం. దాన‍్ని నెరవేరుస్తూనే ఉన్నాం. కష్టసుఖాలను పంచుకుంటూ, ప్రేమను విశ్వసిస్తూ, దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడని భావిస్తూ, ఒకరికొకరం ప్రతిరోజు నిలబడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేశాం. అసలు సమయం తెలియనేలేదు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కుకీ' అని శిల్పా శెట్టి పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇంకా 'ఇక్కడ మరెన్నో అనుభూతులు, నవ్వులు, మైలురాళ్లు, విలువైన ఆస్తులు మా పిల్లలు ఉన్నారు. అన్ని విధాల మాకు సహకరించిన మా శ్రేయోభిలాషుందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.' అని తెలిపారు.
ఈ పోస్ట్‌కు అభిమానులు, స్నేహితులు, సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు లైక్‌లు, కామెంట్‌లతో ముంచెత్తారు. ' వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు' అని నటి బిపాసా బసు కామెంట్ చేశారు. అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసుకు సంబంధించిన ఆరోపణలపై రాజ్ కుంద్రాను జూలై 19న మరో 11 మందితోపాటు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు రూ. 50,000 పూచీకత్తుపై రాజ్‌కు సెప్టెంబర్ 20న బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు
Comments
Please login to add a commentAdd a comment