
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన శిల్పా బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. జూలై 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను కీలక నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. జూలై 23 వరకు కోర్టు అతన్ని రిమాండ్ కు తరలించాల్సిందిగా ఆదేశించింది. శుక్రవారం మరోసారి ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించడంతో పాటు, పోలీసుల విజ్ఞప్తి మేరకు 27వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతా మధ్య లావాదేవీలను విచారించాల్సిన అవసరం ఉందని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తోంది. పోర్న్ వీడియోలను భారీ మొత్తానికి అమ్మకానికి పెట్టినట్లు అతని వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలుస్తుందని ముంబై పోలీసులు తెలిపారు. 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్ డాలర్లకు డీల్ కుదుర్చుకున్నట్లు వాట్సాప్ చాట్‌లో కనుగొన్నామన్నారు. ఈ డీలింగ్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment