
శిల్పాశెట్టి దంపతులకు బెదిరింపు కాల్!
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులకు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో వారికి అదనపు పోలీస్ భద్రతను సమకూర్చారు.
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులకు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో వారికి అదనపు పోలీస్ భద్రతను సమకూర్చారు. మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పుజారి పేరుతో బెదిరింపు కాల్ రావడంతో ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో వారికి అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాకు వచ్చిన కాల్ పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ కాల్ ఉదంతం ఆకతాయిల చేష్టల్లో భాగమేనా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అంతకుముందు షారుఖ్ ఖాన్, సోనూ సూద్, బోమన్ ఇరానీలకు రవి పుజారా పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.