నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గొంగుప్పల్ గ్రామంలో వడదెబ్బకు ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గొంగుప్పల్ గ్రామంలో వడదెబ్బకు ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం గ్రామంలోనే వ్యవసాయ క్షేత్రాల్లో జరుగుతున్న ఉపాధి హామీ కూలీ పనులకు మొండి కైలాస్ (44) వెళ్లాడు. ఎండ ప్రభావానికి మధ్యాహ్న సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. తోటి కూలీలు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.