భార్యాపిల్లలను పోషించేందుకు ఉపాధిహామీ పనులకు వెళ్లి వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు ఓ కూలీ.
మాచారెడ్డి: భార్యాపిల్లలను పోషించేందుకు ఉ పాధిహామీ పనులకు వెళ్లి వడదెబ్బతో ప్రా ణాలు కోల్పోయాడు ఓ కూలీ. మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన ఉల్లెంగుల సత్తయ్య (40) వారం రోజు లుగా ఉపాధి హామీ పనులకు వెళుతున్నాడు. సోమవారం కూడా పనికి వెళ్లిన సత్తయ్య వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. అతడికి గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించారు. అయినా, పరిస్థితి మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు మంగళవారం అర్ధరాత్రి కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.
ఎలాంటి భూమి కూడా లేని సత్తయ్య కేవలం రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఇటీవలే అప్పు చేసి తన కూ తురి పెళ్లి జరిపించాడు. సత్తయ్య మృ తితో ఆ కుటుంబం వీధిన పడింది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వసతులు లేకపోవడం
పనులు చేస్తున్న చోట వసతులు లేకపోవడంతో ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎండల తీవ్రత పెరిగిం ది. ఎండలతో పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండలలో ప నులకు వెళ్లడానికి జంకుతున్నారు. పనులు చేసే చోట నీడ, నీటి వసతులతోపాటు ఫస్ట్ ఎయిడ్ వంటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే కూలీలు పిట్టల్లా రాలిపోతారని ఆందోళన చెందుతున్నారు.