పర్యావరణ అనుమతులు సడలించండి
• పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులకు రూ.7,900 కోట్ల రుణం ఇప్పించండి
• నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి కోరనున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతుల నిబంధనలను సడలించడంతోపాటు ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన కింద 11 పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 7,900 కోట్ల రుణం ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరనున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అనీల్ మాధవ్ దవే, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో వేర్వేరుగా భేటీ కానున్నారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీలో ఏళ్ల తరబడి జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయ అంచనాలు భారీగా పెరిగి ఖజానాపై భారం పడుతోందన్న అంశాన్ని దవే దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ దృష్ట్యా పర్యావరణ అనుమతుల నిబంధనలను సరళతరం చేయాలని కోరను న్నారు. దీంతోపాటే ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య వంటి అంశాలపై ఉమాభారతి అధ్యక్షతన జరగనున్న ఉన్నత స్థారుు సమావేశంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధుల కోసం మరోసారి ఒత్తిడి తేనున్నారు. పీఎంకేఎస్‌వై కింద గుర్తించిన 11 ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తీసుకోవాలన్న నిర్ణయం గురించి ఉమాభారతికి వివరించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎంతో నిమిత్తం లేకుండా రూ.7,900 కోట్ల రుణాలు ఇప్పించాలని విన్నవించనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసేందుకు దీర్ఘకాలిక సాగునీటి నిధి కింద నిధుల విడుదలకు విన్నవించే అవకాశం ఉంది.