కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019 ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఆరు వేల రూపాయలను జమ చేస్తుంది. ఈ పథకం కింద మొదటి విడత నగదును ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులను జమ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది.
అతి త్వరలో 8వ విడత నగదు రైతుల ఖాతాలో పడనున్నాయి. అయితే, ఈ నగదు మీ ఖాతాలో జమ కావాలంటే కచ్చితంగా అర్హుల జాబితాలో మీ పేరు ఉండాలి. అయితే పీఎం కిసాన్ వెబ్‌సైట్(pmkisan.gov.in)లోని అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్టు(అర్హుల జాబితా)లో పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. ఇందులో పేరు ఉంటేనే ఏపీ ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కూడా వస్తుంది.
అర్హు జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
- మొదట మీరు పీఎం కిసాన్(pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి.
- ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్టుపై క్లిక్ చేయాలి.
- తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment