రేపు ఢిల్లీకి హరీశ్ రావు
హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి మంత్రి హరీశ్ రావు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయాలున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు.
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. ఈ కార్యక్రమానకి తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీశ్ రావు హాజరుకానున్నారు.