పీఎంకేఎస్‌వై కింద జిల్లాకు రూ.10.14 కోట్లు
Published Sat, Jun 3 2017 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యెజన(పీఎంకేఎస్‌వై) పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నారు. వివిధ యూనిట్‌ల గ్రౌండింగ్‌కు రూ.10.14 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తోంది. ఈ నిధులతో 4,414 యూనిట్‌లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికార వర్గాలు తెలిపాయి. పథకం కింద 2,061 ఫాంపాండ్స్ తవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో పాటు నీళ్లు ఇంకిపోకుండా పాలిథిన్ షీట్ కూడా పరుస్తారు. ఫాంపాండ్‌కు సబ్సిడీ రూ.25 వేలు.. బోర్ వెల్ వద్ద వాటర్ రీచార్జి స్ట్రక్చర్(సోక్‌పిట్) నిర్మాణానికి రూ.37,500 సబ్సిడీ ఇస్తారు. మూడు గోదాములు(స్టోరేజి స్ట్రక్చర్‌లు) నిర్మించ తలపెట్టారు. గోదాముల నిర్మాణంతో పాటు రహదారి సదుపాయం కల్పిస్తారు. ఒక్కో దానికి రూ.10 లక్షలు సబ్సిడీ ఇస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Advertisement