నేడు కేంద్ర జల సంఘం, జల వనరుల శాఖ అధికారులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 21న నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ భేటీపై స్పష్టత కోసం రాష్ర్ట నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల సంఘం, జల వనరుల శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశం కానున్నారు. 21నే అపెక్స్ భేటీ నిర్వహించిన పక్షంలో ఏయే అంశాలను ఎజెండాలో చేర్చాలి, వాటిపై ఎలాంటి నివేదికలు సమర్పించాలన్న అంశాలపై ఆయన కేంద్ర అధికారుల నుంచి స్పష్టత తీసుకునే అవకాశం ఉంది.
ఇదే సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) పరిధిలో చేర్చిన 11 సాగునీటి పథకాలకు నిధులను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాధ్‌పూర్ , భీమా, వరద కాల్వ ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.7వేల కోట మేర్ల కేంద్ర సాయం అందించేందుకు ఇటీవలే నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పీఎంకేఎస్‌వై కింద రూ.2,500 కోట్లు, నాబార్డ్ రుణం కింద రూ.4,500 కోట్లు ఇప్పించేలా ఒప్పందం జరిగింది.
అపెక్స్ భేటీపై స్పష్టత కోసం ఢిల్లీకి జోషి
Published Thu, Sep 15 2016 4:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
Advertisement