ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా వాడేవారు. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యాపార వేత్తలు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు మాత్రమే పాన్ కార్డు వాడే వారు. కాల క్రమంలో ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావడంతో పాన్ కార్డు తప్పనిసరి. ఇలా పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కోసారి ఇంటి పేరులోనూ, అసలు పేరులోనూ, లేదా అడ్రస్ ఇలాంటి వివరాల్లో తప్పులు దొర్లవచ్చు. కొన్ని సందర్భాల్లో పెళ్లైన యువతులకు వారి ఇంటి పేరు మారుతుంది. అలాంటి సమయంలో వారు తమ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఇంటినుంచే తమ మొబైల్ ఫోన్‌లోనైనా, డెస్క్‌టాప్ కంప్యూటర్లలోనైనా ఆన్‌లైన్‌లో మార్చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా మార్పులు చేర్పులు
మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్‌లో పాన్ అధికారిక అని టైప్ చేస్తే పాన్ కార్డుకు సంబంధించిన వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ఉన్న సర్వీస్ విభాగంలోకి వెళ్లి పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కిందకు స్క్రోల్ చేస్తే Change / Correction in PAN Data సెక్షన్‌లోకి వెళ్లి ఆప్లై ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
అక్కడ మీ పాన్ నంబర్‌తోపాటు తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. ఆపై కింద బటన్ నొక్కి, తర్వాత ప్రక్రియలోకి వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డ్ కరెక్షన్ పేజీ కనిపిస్తుంది. అక్కడ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఇంటి పేరు తదితర వివరాలన్నీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ వివరాలు నమోదు చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు పూర్తి అయ్యాక పాన్ కార్డు అప్‌డేట్ చేసినట్లు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ స్లిప్ ప్రింటవుట్ తీసుకుని, దానిపై రెండు ఫొటోలు అతికించి, సంబంధిత ఎన్ఎస్‌డీఎల్ కార్యాలయానికి పంపించేస్తే.. అక్కడి నుంచి అప్‌డేటెడ్ పాన్ కార్డు అందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment