ఫొటో ఐడెంటిటీలో భాగంగా మన వద్ద ఆదార్, ఓటర్ ఐటీ వంటి చాలా కార్డులే ఉంటాయి. అయితే నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో ప్రస్తుతం పాన్ కార్డు కూడా వచ్చి చేరింది. విలువైన వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును వినియోగిస్తుంటారు.
ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫొటో, పుట్టినతేదీ, సంతకం వంటి వివరాలు ఉంటాయి. నగదు లావాదేవీలకు పాన్‌కార్డు కీలకంగా ఉంటుంది. అలాంటి కార్డులో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్యేం కాదు. ఇంటి వద్దనే మనం వీటిని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లయిన తరవాత చాలా మంది మహిళలు పాన్ కార్డులో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు. అయితే దాని కోసం ఎక్కడకీ వెళ్లే అవసరం లేకుండా తమ ఫోన్ ద్వారానే పేరు మార్చుకోవచ్చు.
మార్పు చేసుకోండిలా..
- మొబైల్/ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో టీఐఎన్ ఎన్‌ఎస్‌డీఎల్ (www.tin-nsdl.com) అని టైప్ చేస్తే, సంబంధిత వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
- దాంట్లో సర్వీసెస్ విభాగంలో PAN అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- కిందకు స్క్రోల్ చేశాక Change/Correction in PAN Data అనే సెక్షన్‌లో అప్లయ్‌పై క్లిక్ చేయాలి.
- అందులో ‘Application Type’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్ చేయాలి.
- పాన్ నంబర్ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో ఇవ్వాలి.
- ఈ వివరాలన్నీ సబ్మిట్ చేశాక మీకో టోకెన్ నంబర్ జారీ చేస్తారు. తర్వాత కింద బటన్‌పై క్లిక్ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి.
- ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించిన కరెక్షన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది.
- సబ్మిట్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన విధానంలో పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది.
- పేమెంట్ అయిన వెంటనే మీరు కార్డును అప్‌డేట్ చేసినట్టుగా ఓ స్లిప్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి.
Comments
Please login to add a commentAdd a comment