ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు చేతులు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆధార్ కార్డ్ నుంచి ముంపు పొంచి ఉందని గుర్తించాలి.
ప్రపచం దేశాల్లో ఆర్దిక మాధ్యం పెరిగిపోయింది. అందుకే సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ సాయంతో బ్యాంక్ అకౌంట్‌లలో ఉన్న నగదును కాజేస్తుంటారు. అయితే మనం కొన్ని చిట్కాలు పాటించి సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు.
►ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆధార్ మరియు పాన్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఇటువంటి వివరాలను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు
► మీ ఆధార్, పాన్‌ని సేకరించడం లేదా మీకు అవసరమైన చోట ధృవీకరణ కోసం ఇచ్చి మరిచిపోతుంటాం. అలా మరిచిపోవద్దు. అలా మరిచి పోవడం వల్ల నేరస్తులు ఆ ఆధార్ కార్డ్ సాయంతో సైబర్ నేరాలకు పాల్పడొచ్చు. లేదంటే మీ డేటాను అమ్ముకోవచ్చు.
► అనుమానంగా ఉన్న వెబ్ సైట్‌లలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఆధార్ కార్డ్‌లను అప్‌లోడ్ చేయొద్దు.
► మీ సిబిల్ స్కోర్‌ను ట్రాక్ చేస్తూ ఉండండి
► ఒకవేళ మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో మీకు తెలియకుండా మరెవరైనా ఆధార్ కార్డ్‌ల సాయంతో మీ డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులను ఆశ్రయించండి.
► ఏ సందర్భంలోనైనా మీరు వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను షేర్ చేయొద్దు. ప్రత్యేకించి ఆధార్, పాన్ లేదా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించింది అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
► ఆధార్ కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు ప్రజల వ్యక్తిగత వివరాలను సెక్యూర్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు మీకు సలహాలు అందిస్తుంటాయి. మీ డేటా వినియోగానికి సంబంధించిన ఏజన్సీలపై అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్‌ను సైబర్ నేరస్తుల నుంచి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment