Financial banks
-
బ్యాంక్ హామీని మినహాయించండి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ(ఎఫ్‌బీజీ) మినహాయించమంటూ టెలికం శాఖ(డాట్)ను అభ్యరి్థంచినట్లు తెలుస్తోంది. స్పెక్ట్రమ్ చెల్లింపులకుగాను 2025 సెపె్టంబర్లో అందించవలసిన రూ. 24,747 కోట్ల ఎఫ్బీజీని మినహాయించమని డాట్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ వేలం నిబంధనల ప్రకారం వార్షికంగా చెల్లించవలసిన మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) ఏడాది ముందుగానే సెక్యూరిటైజ్ చేయవలసి ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై వొడాఫోన్ ఐడియా స్పందించకపోవడం గమనార్హం! 2022కంటే ముందుగా నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కుగాను వీఐఎల్ చెల్లించవలసిన మొత్తమిది. అయితే 2022లో చెల్లింపులపై ప్రభు త్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా వీఐఎల్ నాలుగేళ్ల నిషేధాన్ని(మారటోరియం) వివియోగించుకుంది. ఫలితంగా 2016వరకూ నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులు 2025 అక్టోబర్– 2026 సెప్టెంబర్ మధ్యకాలంలో చేపట్టవలసి ఉంటుంది. మరోవైపు ఏజీఆర్ బకాయిల(చెల్లింపులు)పైనా మారటోరియాన్ని కంపెనీ వినియోగించుకుంది. ఇది 2026 మార్చిలో ముగియనుంది. దీంతో మారటోరియం ముగియడానికి కనీసం 13 నెలల ముందుగా వీఐఎల్ బ్యాంక్ గ్యారంటీలను సమరి్పంచవలసి ఉంటుంది. కాగా.. 2024 మార్చి31కల్లా కంపెనీ ప్రభుత్వానికి రూ. 2,03,430 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,33,110 కోట్లుకాగా.. ఏజీఆర్ బకాయిలు రూ. 70,320 కోట్లు! మారటోరియాన్ని అందుకున్న సమయంలో కంపెనీ రూ. 16,000 కోట్ల వడ్డీ చెల్లింపులను ఈక్విటీ జారీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్ చేసింది. తద్వారా కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించింది. తదుపరి కంపెనీ ఎఫ్‌పీవో ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించడంతో ప్రభుత్వ వాటా 23.8 శాతానికి పరిమితమైంది. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు ఫ్లాట్‌గా రూ. 16.62 వద్ద ముగిసింది. -
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్ వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ ఇన్‌క్లూజన్ మార్కెట్ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్ పేర్కొన్నారు.ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్ యూజర్లు, డిజిటల్ ఫైనాన్షియల్ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్ పేర్కొన్నారు.తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్ పాయింట్స్ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు.. -
స్పందన స్ఫూర్తి వివాదానికి ముగింపు..సెబీకి రూ.25లక్షలు చెల్లింపు
న్యూఢిల్లీ: నియంత్రణ పరమైన నిబంధనల అమలులో విఫలమైన కేసును స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ పరిష్కరించుకుంది. సెబీకి రూ.25 లక్షలు చెల్లించడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలికింది. ‘‘ప్రతిపాదిత ఉల్లంఘనల ఆరోపణల విషయంలో పరిష్కారానికి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సెబీని సంప్రదించింది. సెబీ గుర్తించిన వాస్తవాలను అంగీకరించ లేదు. అలా అని తిరస్కరించ లేదు. నిబంధనల అమలులో వైఫల్యాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చర్యలపై దరఖాస్తుదారుతో పరిష్కారం కుదిరింది’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 2015 ఏప్రిల్ నుంచి ఆర్బీఐ వద్ద నమోదిత సంస్థగా ఉంది. 2019 ఆగస్ట్‌లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఐపీవో ద్వారా లిస్ట్ అయింది. ఆడిటర్ విషయంలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్థ, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ డిస్క్లోజర్ నిబంధనల అమలులో విఫలమైందన్నది సెబీ ఆరోపణగా ఉంది. -
ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే
ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు చేతులు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆధార్ కార్డ్ నుంచి ముంపు పొంచి ఉందని గుర్తించాలి. ప్రపచం దేశాల్లో ఆర్దిక మాధ్యం పెరిగిపోయింది. అందుకే సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ సాయంతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేస్తుంటారు. అయితే మనం కొన్ని చిట్కాలు పాటించి సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ►ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆధార్ మరియు పాన్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఇటువంటి వివరాలను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు ► మీ ఆధార్, పాన్ని సేకరించడం లేదా మీకు అవసరమైన చోట ధృవీకరణ కోసం ఇచ్చి మరిచిపోతుంటాం. అలా మరిచిపోవద్దు. అలా మరిచి పోవడం వల్ల నేరస్తులు ఆ ఆధార్ కార్డ్ సాయంతో సైబర్ నేరాలకు పాల్పడొచ్చు. లేదంటే మీ డేటాను అమ్ముకోవచ్చు. ► అనుమానంగా ఉన్న వెబ్ సైట్లలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఆధార్ కార్డ్‌లను అప్లోడ్ చేయొద్దు. ► మీ సిబిల్ స్కోర్‌ను ట్రాక్ చేస్తూ ఉండండి ► ఒకవేళ మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో మీకు తెలియకుండా మరెవరైనా ఆధార్ కార్డ్‌ల సాయంతో మీ డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ► ఏ సందర్భంలోనైనా మీరు వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను షేర్ చేయొద్దు. ప్రత్యేకించి ఆధార్, పాన్ లేదా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించింది అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ► ఆధార్ కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు ప్రజల వ్యక్తిగత వివరాలను సెక్యూర్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు మీకు సలహాలు అందిస్తుంటాయి. మీ డేటా వినియోగానికి సంబంధించిన ఏజన్సీలపై అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్‌ను సైబర్ నేరస్తుల నుంచి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..! -
చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. పన్నెండు వేల కోట్లు హాంఫట్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి భారీ షాక్ తగిలింది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు చేధించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. 12 వేల కోట్లు పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలినెట్‌వర్క్ యాప్‌ను హ్యాక్ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా చేశారు. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. తిరిగి ఇచ్చేయండి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్ అయిన పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. ఇందులో హ్యాకింగ్‌లో దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవస్థకు సంబంధించి మీరు కొట్టేసిన డబ్బు అతి పెద్దదని పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పిడన వారు తర్వాత పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు కొట్టేసిన సొమ్మును తిరిగి వినియోంచుకోలేరని సూచించింది. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. భిన్నాభిప్రాయాలు పాలినెట్‌వర్క్ హ్యాకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకే రూల్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు చేశారని, వాటని కాదని ముందుకు వెళితే ఇలాగే జరగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు బ్లాక్ చైయిన్ టెక్నాలజీని క్రాక్ చేయడం అంత ఈజీ కాదని, హ్యాకర్ల మేథస్సు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంకొందరి అభిప్రాయంగా వ్యక్తమైంది. హ్యాక్ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తే... హ్యాకర్లను శిక్షించకుండా ఉద్యోగం ఇవ్వాలన్న వారూ ఉన్నారు. Hope you will transfer assets to addresses below: ETH: 0x71Fb9dB587F6d47Ac8192Cd76110E05B8fd2142f BSC: 0xEEBb0c4a5017bEd8079B88F35528eF2c722b31fc Polygon: 0xA4b291Ed1220310d3120f515B5B7AccaecD66F17 pic.twitter.com/mKlBQU4a1B — Poly Network (@PolyNetwork2) August 11, 2021 -
ఆర్బీఐ ఎఫెక్ట్- ఫైనాన్షియల్ షేర్ల దూకుడు
ముంబై, సాక్షి: రిజర్వ్ బ్యాంక్ ప్యానల్ చేసిన తాజా ప్రతిపాదనలు దేశీ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. భారీ కార్పొరేట్ హౌస్‌లకు బ్యాంకింగ్ లైసెన్సుల మంజూరీ, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులుగా మారేందుకు అవకాశం వంటి పలు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతో స్మాల్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా పలు ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రంగంలోని పలు లిస్టెడ్ షేర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పలు సంస్కరణలు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన ప్యానల్ బ్యాంకింగ్ లైసెన్సులకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అర్హత కలిగిన అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్‌లకు బ్యాంకింగ్ లైసెన్సులు, పేరున్న ఎన్బీఎఫ్సీలు బ్యాంకులుగా మారేందుకు అవకాశం, 15 ఏళ్ల తదుపరి ప్రమోటర్ల వాటా 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతి తదితర పలు కీలక ప్రతిపాదనలు చేసింది. దీంతో ప్రధానంగా చిన్న బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కౌంటర్లు జోరు చూపుతున్నాయి. జోరుగా హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐడీఎఫ్సీ లిమిటెడ్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 40.20 వద్ద, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ 20 శాతం పెరిగి రూ. 40.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ బాటలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ 18 శాతం దూసుకెళ్లి రూ. 292ను తాకగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ 12 శాతం జంప్‌చేసి రూ. 38కు చేరింది. ఇకబజాజ్ హోల్డింగ్స్7 శాతం ఎగసి రూ. 3,215 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,250ను తాకింది. ఇక శ్రీరామ్ సిటీ యూనియన్ 5.5 శాతం పెరిగి రూ. 1,064 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,098కు చేరింది. ఇతర కౌంటర్లలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 3.6 శాతం పెరిగి రూ. 968 వద్ద, ఆవాస్ ఫైనాన్షియర్స్ 3.6 శాతం లాభంతో రూ. 1548 వద్ద కదులుతున్నాయి. ఆవాస్ తొలుత రూ. 1,610 వరకూ ఎగసింది. ఇదేవిధంగా మ్యాక్స్ ఫైనాన్షియల్ 3 శాతం వృద్ధితో రూ. 636 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 648 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ 2.5 శాతం లాభపడి రూ. 347 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 355ను అధిగమించడం ద్వారా ఏడాది గరిష్టాన్ని తాకింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్- మార్కెట్లు జూమ్
ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుడుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో తొలుత లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 355 పాయింట్లు జంప్‌చేసి 40,538ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 11,918 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,543 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,067 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. పాలసీ నిర్ణయాలలో భాగంగా ఆర్బీఐ గృహ రుణాలపై రిస్క్ వెయిట్స్‌ను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. వ్యక్తిగత గృహ రుణాల విషయంలో రుణ పరిమాణం, రుణ విలువ తదితర అంశాల ఆధారంగా వివిధ రిస్క్ వెయిట్స్ అమలుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్ స్పీడ్ ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 2.25 శాతం పుంజుకోగా.. ఫార్మా, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్, శ్రీ సిమెంట్, బీపీసీఎల్, ఐవోసీ, టాటా స్టీల్ 3.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, గ్రాసిమ్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో,టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, టీసీఎస్ 1.6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోరు డెరివేటివ్స్‌లో ఎల్ఐసీ హౌసింగ్, ఐబీ హౌసింగ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఇండిగో, బంధన్ బ్యాంక్, హావెల్స్, మైండ్‌ట్రీ, యూబీఎల్, జిందాల్ స్టీల్ 10-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్ఫ్రాటెల్, ఐజీఎల్, టాటా కన్జూమర్, బాలకృష్ణ, బెర్జర్ పెయింట్స్, గ్లెన్‌మార్క్, వోల్టాస్, ముత్తూట్ ఫైనాన్స్ 2.7-1.27 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1113 లాభపడగా.. 1087 నష్టాలతో కదులుతున్నాయి. -
2008 సంక్షోభం- 2020లో పాఠాలు
పన్నెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నుంచి పలు పాఠాలను నేర్చుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2008-09లో సబ్‌ప్రైమ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇటీవల ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు నెలల క్రితం ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అయితే ఫెడరల్ రిజర్వ్, ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితర కేంద్ర బ్యాంకుల బారీ సహాయక ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ వెల్లువెత్తి మార్కెట్లు వేగవంతంగా బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. దేశీయంగానూ కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. ఈక్విటీలలో పెట్టుబడులు అంటే అధిక రిటర్నులు, అత్యంత రిస్కుతో కూడుకున్న వ్యహహారమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశంలో చిన్న ఇన్వెస్టర్లు గతం నుంచి పలు విషయాలను అభ్యసించి అమలు చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎడిల్వీజ్ వెల్త్‌మేనేజ్‌మెంట్ నిపుణులు రాహుల్ జైన్ తదితర విశ్లేషకులు ఇంకా ఏమంటున్నారంటే.. దీర్ఘకాలానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు దీర్ఘకాలిక దృష్టితో తీసుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఇండెక్స్ ఆధారిత రిటర్నులను ఆశించినప్పటికీ ఆటుపోట్లను తట్టుకుని అధిక కాలం కొనసాగితే భారీ లాభాలకు అవకాశముంటుంది. నిజానికి ఏవేని కారణాలతో మార్కెట్లు పతనమయ్యే సందర్భాలలో ఇన్వెస్టర్లను నిరాశావాదం ఆవహిస్తుంది. ఇది అనాలోచిత నిర్ణయాలకు కారణమవుతుంది. 2008లో తొలుత మార్కెట్లు పతనమయ్యాయి. తదుపరి 2009లో వెనువెంటనే భారీ ర్యాలీ చేశాయి. సంక్షోభ సమయాల్లో పెట్టుబడి అవసరంలేకపోతే.. దీర్ఘకాలం కొనసాగడం మేలు. మిగులు సొమ్ముంటే.. మరిన్ని పెట్టుబడులు చేపట్డం దీర్ఘకాలంలో ప్రయోజనాన్నికలిగిస్తుంది. నాణ్యత ప్రధానం స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రధానంగా నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవడం కీలకంగా నిలుస్తుంది. పటిష్ట ఫండమెంటల్స్, బలమైన యాజమాన్యం, బిజినెస్‌లకున్న అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. బ్యాలన్స్‌షీట్, క్యాష్‌ఫ్లో వంటి అంశాలు కంపెనీ ఫండమెంటల్స్‌ను వెల్లడిస్తాయి. సంక్షోభ సమయాల్లోనూ నిలదొక్కుకోగల వ్యూహాలు, ప్రోడక్టులకున్న డిమాండ్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి. డైవర్సిఫికేషన్ నిజానికి 2008 జూన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ సెప్టెంబర్‌కల్లా ప్రభావం మరింత కనిపించడం ప్రారంభమైంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమన్ బ్రదర్స్ దివాళా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లకు షాకిచ్చింది. అప్పట్లో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకే అధిక శాతం కేటాయింపులు చేపట్టిన ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. సాధారణంగా భవిష్యత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోగల, ఆయా విభాగాల్లో మంచి మార్కెట్ వాటా కలిగిన రంగాలు, కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, వినియోగం, హెల్త్‌కేర్ వంటి రంగాలు ఇన్వెస్టర్లకు కొంతమేర రక్షణాత్మక రంగాలుగా భావించవచ్చు. పరిస్థితులు వేరు దశాబ్ద కాలం క్రితం ఫైనాన్షియల్ అంశాలు సంక్షోభానికి కారణం కారణంగా ప్రస్తుతం కరోనా వైరస్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థికపరంగానూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్త లాక్‌డవున్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థలు నీరసిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల మద్దతుతో వచ్చే ఏడాదికల్లా ప్రపంచ జీడీపీ పుంజుకునే వీలుంది. అదీకాకుండా కోవిడ్-19కు వ్యాక్సిన్ వెలువడితే.. మార్కెట్లు మరింత వేగమందుకోవచ్చు. -
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి. డిజిటల్‌తో వినూత్న ప్రయోగాలు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్‌కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్‌వర్క్‌కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్‌తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు. శాఖల్లో ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం.. డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు. యాక్సిస్ ఏటా 400 శాఖలు.. వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి. 2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్‌వర్క్‌పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది. -
పెద్ద యూసీబీలను రెగ్యులర్ బ్యాంకులుగా మార్చండి
ఆర్బీఐ ప్యానెల్ సిఫార్సు ముంబై : దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనువుగా పెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను (యూసీబీ) రెగ్యులర్ బ్యాంకులుగా మార్చాల్సిన అవసరముందని ఆర్బీఐ ప్యానెల్ పేర్కొంది. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను రెగ్యులర్ బ్యాంకులుగా మార్చాలని ఆర్బీఐ ప్యానెల్ సిఫార్సు చేసింది. వీటి వ్యాపార పరిమాణం కనీసం రూ.20,000 కోట్లుగా ఉండాలని సూచించింది. ‘పెద్ద మల్టీ-స్టేట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉంటాయి. ఫారెక్స్, మనీ మార్కెట్, పేమెంట్ సిస్టమ్స్ వంటి తదితర కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఒకవేళ అవి విఫలమైతే దాని ప్రభావం మొత్తం యూసీబీ రంగంపై ఉంటుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి యూసీబీలను వాణిజ్య బ్యాంకులుగా మార్చితే సరిపోతుంది’ అని వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా యూసీబీలను చిన్న బ్యాంకులుగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. యూసీబీలను వాణిజ్య బ్యాంకులుగా మార్చాలని మాత్రమే ప్రతిపాదించామని, అంతేకానీ వాణిజ్య బ్యాంకులు అందించే అన్ని సేవలను యూసీబీలు కూడా అందించటానికి ప్యానెల్ సమ్మతించలేదు. రూ.20,000 కోట్లకు తక్కువ వ్యాపార పరిమాణం కలిగిన చిన్న యూసీబీలు చిన్న ఫైనాన్షియల్ బ్యాంకులుగా మారాలని భావిస్తే ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మూసివేత, విలీనం వంటి అంశాల వల్ల 2008 మార్చి చివరకు 1,770గా ఉన్న యూసీబీల సంఖ్య ఈ ఏడాది మార్చి చివరకు 1,579గా ఉంది.