సినీ తారలు బయట కనిపిస్తే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో కనబడగానే ఎగబడిపోతుంటారు ఫ్యాన్స్. అందుకే మన స్టార్స్ అంతా ప్రైవసి కోసం ఎక్కువగా విదేశాల్లో వాలిపోతుంటారు. అక్కడ రోడ్లపై ఎలాంటి హడావుడి లేకుండా కూల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు. షూటింగ్‌కి గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేస్తాడు. అందుకే హైదరాబాద్ రోడ్లపై మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తాడు.
చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు!
సినిమా షూటింగ్, ఈవెంట్స్ తప్పితే పెద్దగా బయటకు రాడు. అలాంటి మహేశ్ బాబు తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీలో కనిపించాడు. చూట్టు ఎలాంటి హడావుడి లేకుండా చాలా కూల్ తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే అది సినిమా షూటింగ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అవును మహేశ్ తాజాగా తన పర్సనల్ పని మీదగా స్వయంగా హైటెక్ సిటీకి వచ్చాడు. తన ఆధార్ కార్డ్‌కు సంబంధించి వెరిఫికేషన్ కోసం హైటెక్ సిటీలోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆఫీస్‌కు హాజరయ్యాడు మహేశ్.
చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్ ముందే స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!
అయితే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుని వెళ్లిపోయాడు. ఆఫీస్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటున్న దృశ్యాన్ని అక్కడి వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో మహేశ్ బాబు కొత్త లుక్‌లో కనిపించాడు. లాంగ్ హెయిర్ కట్, క్యాజువల్ షర్ట్‌లో ఆకట్టుకున్నాడు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బి28 చిత్రంతో మహేశ్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్ జరపుకుంటోంది.
Babu 😍 at Aadhar Verification Centre!! @urstrulyMahesh :)
— #SSMB28🌟 (@urstrulyyogi_) February 8, 2023
Ekkada Kudaa Odilee laa leru gaa😂#MaheshBabu #SSMB28 pic.twitter.com/r3xMjwl0oE
Comments
Please login to add a commentAdd a comment