Hightech city
-
హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్
సినీ తారలు బయట కనిపిస్తే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో కనబడగానే ఎగబడిపోతుంటారు ఫ్యాన్స్. అందుకే మన స్టార్స్ అంతా ప్రైవసి కోసం ఎక్కువగా విదేశాల్లో వాలిపోతుంటారు. అక్కడ రోడ్లపై ఎలాంటి హడావుడి లేకుండా కూల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు. షూటింగ్‌కి గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేస్తాడు. అందుకే హైదరాబాద్ రోడ్లపై మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తాడు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! సినిమా షూటింగ్, ఈవెంట్స్ తప్పితే పెద్దగా బయటకు రాడు. అలాంటి మహేశ్ బాబు తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీలో కనిపించాడు. చూట్టు ఎలాంటి హడావుడి లేకుండా చాలా కూల్ తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే అది సినిమా షూటింగ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అవును మహేశ్ తాజాగా తన పర్సనల్ పని మీదగా స్వయంగా హైటెక్ సిటీకి వచ్చాడు. తన ఆధార్ కార్డ్‌కు సంబంధించి వెరిఫికేషన్ కోసం హైటెక్ సిటీలోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆఫీస్‌కు హాజరయ్యాడు మహేశ్. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్ ముందే స్టేజ్‌పై సిరి కన్నీళ్లు! అయితే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుని వెళ్లిపోయాడు. ఆఫీస్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటున్న దృశ్యాన్ని అక్కడి వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో మహేశ్ బాబు కొత్త లుక్‌లో కనిపించాడు. లాంగ్ హెయిర్ కట్, క్యాజువల్ షర్ట్‌లో ఆకట్టుకున్నాడు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎమ్బి28 చిత్రంతో మహేశ్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్ జరపుకుంటోంది. Babu 😍 at Aadhar Verification Centre!! @urstrulyMahesh :) Ekkada Kudaa Odilee laa leru gaa😂#MaheshBabu #SSMB28 pic.twitter.com/r3xMjwl0oE — #SSMB28🌟 (@urstrulyyogi_) February 8, 2023 -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్‌లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్‌పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
హైటెక్ సిటీ పరిసరాల్లో ఫ్రీ వైఫై
హైదరాబాద్ : పైలట్ పబ్లిక్ వైఫై సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వైఫై సేవలను ప్రారంభించారు. దాంతో ఈ సేవలు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వినియోగదారుడు 750 ఎంబి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, వైఫై సేవలను అందించేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. నగరాన్ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా చేయటంలో భాగంగా ఇది తొలి అడుగు అని ఆయన అన్నారు. వైఫైతో హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతామని తెలిపారు. ఐదు నెలల్లో నగరం మొత్తం వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ సహకారంతో 17 సెంటర్లల్లో ప్రయోగాత్మకంగా వైఫై సేవలు అందిస్తున్నాట్లు తెలిపారు. -
బెస్ట్ వెస్ట్రన్
హాస్పిటాలిటీ చైన్స్‌లో ప్రముఖమైన బెస్ట్ వెస్ట్రన్ అశోకా హైటెక్ సిటీలో గురువారం ప్రారంభమైంది. విలాసవంతమైన హంగులతో నెలకొల్పిన ఈ హోటల్లో కాఫీ షాప్, మల్టీక్వీజిన్ రెస్టారెంట్ వంటివెన్నో ఉన్నాయి. దేశంలోని విభిన్న వంటకాలను ఈ రెస్టారెంట్లో టేస్ట్ చేయవచ్చు. -
సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హైటెక్ సిటీ జనాలకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అర్థరాత్రి సమయంలో అనుకోని విధంగా అభిమాన హీరో కనిపించేసరికి ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'గోపాల గోపాల' షూటింగ్లో ఆదివారం పవన్ పాల్గొన్నాడు. అప్పుడు సమయం అర్థరాత్రి ఒంటిగంట. ఆసమయంలో అటువైపు వెళుతున్నవారికి షూటింగ్లో పాల్గొన్న పవన్ కన్పించాడు. అంతే ఈ వార్త క్షణాల్లో పాకిపోయింది. దాంతో అభిమానులు, చుట్టుపక్కల జనాలు పెద్దఎత్తున తరలి వచ్చారు. షూటింగ్ సన్నివేశాలను తమ కెమెరాల్లోకి ఎక్కించేందుకు ఉత్సాహపడ్డారు. ఇక చిత్ర యూనిట్.. పవన్ కళ్యాణ్‌పై బైక్ సీన్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'ఓ మైగాడ్' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో ఇది పవర్ఫుల్ ఛేజింగ్ సీన్‌గా తెలుస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్ బైక్‌పై వచ్చి, పరేశ్ రావల్ని కాపాడే సీన్ ఉండగా..... ఆ సన్నివేశాన్ని పవన్, వెంకీలపై తెరకెక్కించారట. ఇందుకోసం ఫారిన్ నుంచి ఈ బైక్‌ను తెప్పించినట్లు సమాచారం. ఈ బైక్ ఎపిసోడ్ 'గోపాలా గోపాలా' సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. -
జీటీ టేస్టీ
యుూరోప్ కంట్రీస్ హోంస్టైల్లో రెసిపీలను రెడీ చేస్తూ సిటీజనులను ఆకట్టుకోవడానికి హైటెక్‌సిటీలో జీటీ బార్ అండ్ కిచెన్ ఆదివారం ప్రారంభమైంది. వెరైటీ వంటకాలతో జిహ్వకు జీవం పోస్తూ.. వహ్వా అనిపించడమే తవు ప్రత్యేకత అంటున్నారు ‘జీటీ’ యుజవూని సయ్యుద్ జురేర్ అబ్బాస్. కంఫర్ట్ ఫుడ్.. బేక్డ్ పోటాటో స్కిన్స్, చిమ్మిచంగస్, బీఫ్ షేక్, లాంబ్ షేక్, బిట్స్ ఆఫ్ హెవెన్... ఇలా డిఫరెంట్ వంటకాలు ఉంటార. యూరోపియన్‌కు చెందిన ఈ వంటకాల టేస్ట్ బాగుంటుంది. స్లోగా కుక్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆహారం తినేందుకు సౌకర్యంగా ఉంటుంది. దీన్ని కంఫర్ట్ ఫుడ్ అని కూడా అనొచ్చు. పీన్ అండ్ గోట్ చీసీ సలాడ్, స్మోక్డ్ చికెన్, సన్డ్రౌడ్ టమోటో సలాడ్ టేస్ట్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. బర్గర్స్ అండ్ స్టేక్స్, బనోఫీ పీ, బిట్స్ ఆఫ్ హెవెన్ స్పైస్ రుచి చూసేందుకు ఆహారప్రియులు ఎగబడుతుంటారు. వైట్ వైన్ తాగినప్పుడు సాసేజ్ అండ్ సిసనైజ్, స్టఫ్డ్ చికెన్ తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. రెడ్ వైన్ తాగినప్పుడు బీఫ్ స్టిక్, లాంబ్షేక్లు స్టఫ్‌గా తీసుకుంటే ఆహా అనాల్సిందే. - తాలీబ్ హుస్సేన్, ముంబై చెఫ్