సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ | pawan kalyan suprise on sunday night at hitech city | Sakshi
Sakshi News home page

సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్

Published Tue, Sep 23 2014 10:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ - Sakshi

సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హైటెక్ సిటీ జనాలకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అర్థరాత్రి సమయంలో అనుకోని విధంగా అభిమాన హీరో కనిపించేసరికి ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'గోపాల గోపాల' షూటింగ్లో ఆదివారం పవన్ పాల్గొన్నాడు. అప్పుడు సమయం అర్థరాత్రి ఒంటిగంట.  ఆసమయంలో అటువైపు వెళుతున్నవారికి షూటింగ్లో పాల్గొన్న పవన్ కన్పించాడు. అంతే ఈ వార్త క్షణాల్లో పాకిపోయింది. దాంతో అభిమానులు, చుట్టుపక్కల జనాలు పెద్దఎత్తున తరలి వచ్చారు. షూటింగ్ సన్నివేశాలను తమ కెమెరాల్లోకి ఎక్కించేందుకు ఉత్సాహపడ్డారు.

ఇక చిత్ర యూనిట్.. పవన్ కళ్యాణ్పై బైక్ సీన్ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'ఓ మైగాడ్'  రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో ఇది పవర్ఫుల్ ఛేజింగ్ సీన్గా తెలుస్తోంది. హిందీలో  అక్షయ్ కుమార్ బైక్పై వచ్చి, పరేశ్ రావల్ని కాపాడే సీన్ ఉండగా..... ఆ సన్నివేశాన్ని పవన్, వెంకీలపై తెరకెక్కించారట. ఇందుకోసం ఫారిన్ నుంచి  ఈ బైక్ను తెప్పించినట్లు సమాచారం. ఈ బైక్ ఎపిసోడ్ 'గోపాలా గోపాలా' సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement