o my god
-
'ఓ మై గాడ్-2' సీక్వెల్‌పై క్లారిటీ వచ్చేసింది..
హిందీ హిట్ ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్’ (2012) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్ 2’ రూపొందనుందనే టాక్ బీ టౌన్లో ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకుడి విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్పై తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్’ (2012) చిత్రంలో అక్షయ్‌కుమార్, పరేష్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సీక్వెల్లో అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు బాలీవుడ్ టాక్. ‘రోడ్ టు సంగం’ ఫేమ్ అమిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఓ మై గాడ్’ తెలుగులో ‘గోపాల గోపాల’ (2015)గా రీమేక్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఓ మై గాడ్!
-
సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హైటెక్ సిటీ జనాలకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అర్థరాత్రి సమయంలో అనుకోని విధంగా అభిమాన హీరో కనిపించేసరికి ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'గోపాల గోపాల' షూటింగ్లో ఆదివారం పవన్ పాల్గొన్నాడు. అప్పుడు సమయం అర్థరాత్రి ఒంటిగంట. ఆసమయంలో అటువైపు వెళుతున్నవారికి షూటింగ్లో పాల్గొన్న పవన్ కన్పించాడు. అంతే ఈ వార్త క్షణాల్లో పాకిపోయింది. దాంతో అభిమానులు, చుట్టుపక్కల జనాలు పెద్దఎత్తున తరలి వచ్చారు. షూటింగ్ సన్నివేశాలను తమ కెమెరాల్లోకి ఎక్కించేందుకు ఉత్సాహపడ్డారు. ఇక చిత్ర యూనిట్.. పవన్ కళ్యాణ్‌పై బైక్ సీన్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'ఓ మైగాడ్' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో ఇది పవర్ఫుల్ ఛేజింగ్ సీన్‌గా తెలుస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్ బైక్‌పై వచ్చి, పరేశ్ రావల్ని కాపాడే సీన్ ఉండగా..... ఆ సన్నివేశాన్ని పవన్, వెంకీలపై తెరకెక్కించారట. ఇందుకోసం ఫారిన్ నుంచి ఈ బైక్‌ను తెప్పించినట్లు సమాచారం. ఈ బైక్ ఎపిసోడ్ 'గోపాలా గోపాలా' సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. -
‘గోపాల గోపాల’లో కొత్త శ్రీయ
శ్రీయ తన కెరీర్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే పోషించారు. పరిపూర్ణ వ్యక్తిత్వం గల స్త్రీగా ఆమె నటించింది లేదు. తొలిసారిగా ‘మనం’లో అలా కనిపించింది. ఇంకేముంది ఎక్కడ లేని ప్రశంసలు. లేటెస్ట్ లేడీ సూపర్‌స్టార్ సమంతకు దీటుగా మార్కుల్ని కొట్టేశారు శ్రీయ. పైగా ‘మనం’లో సమంత పాత్రతో పోలిస్తే శ్రీయ పాత్ర నిడివి చాలా తక్కువ. ఏది ఏమైనా ‘మనం’ ఆమెకు మంచి మలుపు అయ్యింది. ఇప్పుడు ‘గోపాల గోపాల’ లాంటి ప్రతిష్ఠాత్మకమైన చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యిందంటే.. అదంతా ‘మనం’ పుణ్యమే. విశేషమేంటంటే- ‘గోపాల గోపాల’లో కూడా శ్రీయ పాత్ర సామాన్యమైనది కాదట. నిజమైన స్త్రీ మూర్తికి నిర్వచనంగా ఆ పాత్ర ఉంటుందట. పైగా వెంకటేశ్ పాత్రకు దీటుగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. నిజానికి మాతృక ‘ఓ మైగాడ్’లో కథానాయిక పాత్ర లేదు. కేవలం తెలుగు సినిమా కోసమే ఈ పాత్రను దర్శకుడు డాలీ డిజైన్ చేశారట. ఈ పాత్ర గురించి ఇటీవల శ్రీయ మాట్లాడుతూ- ‘‘నాకు కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఇంత గొప్పగా మొదలవుతుందని అనుకోలేదు. ఈ విషయంలో ‘మనం’ సినిమాకు థ్యాంక్స్. ఇప్పుడు చేస్తున్న ‘గోపాల గోపాల’లో కూడా నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఒక కొత్త శ్రీయను చూస్తారు. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఈ పాత్ర నాకు ఓ ఊతంగా ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు. -
ఇద్దరు కాదు, ముగ్గురు హీరోలు!
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో మల్టీ స్టారర్స్ హవా కొనసాగుతోంది. గతంలో తెలుగులో మల్టీ స్టార్ చిత్రాలు అనేకం వచ్చాయి. ఎన్టీఆర్-ఏఎన్మార్, ఎన్టీఆర్-కృష్ణ, ఏఎన్మార్-కృష్ణ,శోభన్ బాబు-కృష్ణ, ఎన్టీఆర్-మోహన్ బాబు, ఏఎన్మార్-చిరంజీవి.....ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తరువాత తెలుగులో మల్టీ స్టార్ చిత్రాలకు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ అటువంటి చిత్రాల నిర్మాణం మొదలైంది. మంచి ఫలితాలూ వస్తున్నాయి. ఇది మంచి పరిణామం. స్టార్ హీరోలు అన్నదమ్ముల్లా స్క్రీన్‌పై బుజాన చేతులేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరు కాదు, ఇప్పుడు ముచ్చటగా ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్లు స్క్రీన్‌ను షేర్ చేసుకునే విధంగా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ మధ్య టాలీవుడ్లో ట్రెండ్‌గా మారింది. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో తన గోంతుని రెండు చిత్రాలకు అందించారు. ఇప్పుడు మరోసారి తను తెరపై కనిపించకుండా తన కంఠాన్ని వినిపించనున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న 'ఓ మైగాడ్' రీమేక్‌కి మహేష్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. హిందీలో అక్షయ్ కుమార్, పరేవష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాలీవుడ్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కాంబినేషన్లో రూపొందబోయే 'ఓ మై గాడ్' రీమేక్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రనిర్మాణానికి కావలసిన అన్ని పనులు శరవేగంతో జరుగుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఇంతకు ముందు చాలా పేర్లు అనుకున్నారు. నిర్మాతలకు ఏదీ నచ్చలేదు. అయితే ప్రస్తుతానికి 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గా సమాచారం. అన్ని హంగులతో కిషోర్ కుమార్ (డాలీ) దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నయనతార, శ్రీయ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. -
గోపాలా.. గోపాలా..?
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు. దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? ఆసక్తికరమైన ఈ కథాంశంతో బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మైగాడ్’. దేవునిపై కోర్టుకెక్కిన సామాన్యుడి పాత్రలో పరేశ్‌రావల్ జీవిస్తే, దైవంగా అక్షయ్‌కుమార్ అదరహో అనిపించేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తెరపై వచ్చిన అమోఘమైన ప్రయోగం ‘ఓ మైగాడ్’. ఈ కథను తెలుగీకరించాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. ఈ విషయంలో నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ను అభినందించాల్సిందే. ఇందులో పరేశ్‌రావెల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్ పోషించనున్న విషయం తెలిసిందే. సవాల్‌గా తీసుకొని వీరిద్దరూ ఈ పాత్రల్ని పోషించనున్నట్లు తెలిసింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాల దర్శకుడు డాలీ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో ఇప్పటివరకూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ‘దేవ దేవం భజే’ అంటుంటే, ఇంకొందరూ ‘గో గో గో గోవిందా’ అనే పేరును ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే... ‘సాక్షి’కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రీయను తీసుకున్నారు. మాతృకలో చేసిన పాత్రనే ఇందులో మిథున్ చక్రవర్తి పోషించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. -
ఓ మైగాడ్