ఇద్దరు కాదు, ముగ్గురు హీరోలు! | Three Heros! | Sakshi
Sakshi News home page

ఇద్దరు కాదు, ముగ్గురు హీరోలు!

Published Sun, Jun 8 2014 4:07 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మహేష్-వెంకటేష్-పవన్ కళ్యాణ్ - Sakshi

మహేష్-వెంకటేష్-పవన్ కళ్యాణ్

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో  మల్టీ స్టారర్స్ హవా కొనసాగుతోంది. గతంలో తెలుగులో  మల్టీ స్టార్ చిత్రాలు అనేకం వచ్చాయి. ఎన్టీఆర్-ఏఎన్మార్, ఎన్టీఆర్-కృష్ణ, ఏఎన్మార్-కృష్ణ,శోభన్ బాబు-కృష్ణ, ఎన్టీఆర్-మోహన్ బాబు, ఏఎన్మార్-చిరంజీవి.....ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తరువాత  తెలుగులో మల్టీ స్టార్ చిత్రాలకు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ అటువంటి చిత్రాల నిర్మాణం మొదలైంది. మంచి ఫలితాలూ వస్తున్నాయి. ఇది మంచి పరిణామం. స్టార్ హీరోలు అన్నదమ్ముల్లా  స్క్రీన్పై  బుజాన చేతులేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరు కాదు, ఇప్పుడు  ముచ్చటగా ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్లు స్క్రీన్ను షేర్ చేసుకునే విధంగా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ మధ్య టాలీవుడ్లో ట్రెండ్గా మారింది. అందులో భాగంగా  సూపర్ స్టార్  మహేష్ బాబు గతంలో తన గోంతుని రెండు చిత్రాలకు అందించారు. ఇప్పుడు మరోసారి తను తెరపై కనిపించకుండా తన కంఠాన్ని వినిపించనున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విక్టరీ వెంకటేష్   కలిసి నటిస్తున్న 'ఓ మైగాడ్' రీమేక్కి మహేష్తో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

హిందీలో అక్షయ్ కుమార్, పరేవష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాలీవుడ్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ - వెంకటేష్  కాంబినేషన్లో రూపొందబోయే 'ఓ మై గాడ్' రీమేక్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.   ఈ చిత్రనిర్మాణానికి కావలసిన అన్ని పనులు శరవేగంతో జరుగుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. త్వరలో సెట్పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఇంతకు ముందు చాలా పేర్లు అనుకున్నారు. నిర్మాతలకు ఏదీ నచ్చలేదు. అయితే ప్రస్తుతానికి 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్నగర్ వర్గా సమాచారం. అన్ని హంగులతో కిషోర్ కుమార్ (డాలీ) దర్శకత్వంలో రూపొందే  ఈ చిత్రంలో  నయనతార, శ్రీయ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement