ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న పౌరులకు ఆధార్ కార్డు విశిష్టత, దాని ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కావున ఈ కార్డులోని వివరాలు అన్నీ కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి. ఈ తరుణంలో ఆధార్ అప్‌డేట్‌పై 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) ఓ కొత్త సర్క్యూలర్ జారీ చేసింది.
ఇప్పుడు యుఐడిఏఐ అందించిన సమాచారం ప్రకారం, ఆధార్ అప్‌డేట్ లేదా ఇతర సర్వీసుల కోసం రిజిస్ట్రార్స్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు గరిష్ఠంగా ఎంత ఛార్జీలు వసూలు చేయాలనే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. అంతే కాకుండా ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారి ఆధార్ అప్‌డేట్, బయోమెట్రిక్ అప్‌డేట్, ఆధార్ జనరేషన్ వంటి వాటికి సైతం నిర్దిష్ట ఛార్జీలను నిర్ణయించింది.
మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలకు పైన అయినప్పుడు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయకుండా ఉంటే వెంటనే అప్‌డేట్ చేయాలి. దీనికోసం గత నెలలోనే ఒక ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగానే అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అప్‌లోడ్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
యూఐడీఏఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం, 2023 మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఎటువంటి చార్జీలు లేకుండానే ఫ్రీగా ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఏప్రిల్ 20 న ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యూలర్ ఎంబీసీ పాలసీని కొనసాగించడం, హోమ్ ఎన్‌రోల్‌మెంట్ సర్వీస్ ప్రారంభించేందుకు నిబంధనలు వెల్లడించింది. ఇందులో కొత్త చార్జీలు కూడా వెల్లడయ్యాయి.
OM No. HQ16033/1/2020-EU-I-HQ-Part(2) (E-8026) ప్రకారం కొత్త ఛార్జీలు:
0 నుంచి 5 ఏళ్ళలోపు వయసున్న వారి ఆధార్ జనరేషన్ కోసం ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆధార్ కేంద్రానికి వెళ్లినట్లయితే రూ.50 చెల్లించాలి. ఐదు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారు ఆధార్ జనరేషన్ కోసం 100 రూపాయలు & బయోమెట్రిక్ అప్‌డేషన్ కోసం రూ. 100 చెల్లించాల్సి వస్తుంది.
(ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!)
బయోమెట్రిక్ అప్‌డేషన్ కోసం రిజిస్ట్రార్లు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు రూ. 100 వసూలు చేస్తారు. డెమొగ్రాఫిక్ అప్‌డేట్ కోసం రూ.50 చెల్లించాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లో పీఓఐ డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం రూ. 50 చెల్లించాలి. అయితే మైఆధార్ పోర్టల్ ద్వారా అయితే రూ.25 మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
హోమ్ ఎన్‌రోల్‌మెంట్ సర్వీస్:
ఆధార్ కార్డు బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్ అప్డేషన్ హోమ్ ఎన్‌రోల్‌మెంట్ కోసం అదనంగా ఛార్జ్ చేస్తారు. అయితే, ఒకే అడ్రస్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆధార్ అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటి కార్డుకు రూ.700 తర్వాత ఒక్కోదానికి రూ.350 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: ఈ ఆఫర్‌తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!)
ఆధార్‌లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మార్చుకోవడం ఎలా?
- ఆధార్‌లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మార్చుకోవాలనుకునే వారు ముందుగా https://myaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి.
- లాగిన్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ కోసం క్లిక్ చేయాలి.
- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్‌డేట్‌పై క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీ కార్డు వివరాలు చూడవచ్చు.
- మీ కార్డు వివరాలు తప్పుగా ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చు, ఆ తరువాత నెక్ట్స్ హైపర్ లింక్‌పై క్లిక్ చేయాలి
- ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- అప్‌డేట్ ఆయిన పీఓఏ, పీఓఐ డాక్యుమెంట్లు యూఐడీఏఐ వెబ్‌సైట్లో ఉంటాయి. అక్కడ వీటిని పరిశీలించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment