
తెలుగు సినిమానే అగ్రస్థానంలో ఉందని సీనియర్ దర్శకుడు భారతీరాజా పేర్కొన్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై పి.శశికుమార్ నిర్మించిన చిత్రం ఆధార్. కరుణాస్ కథా నాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి రాంనాథ్ పళణికుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. శ్రీకాంత్ దేవా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్‌లో కరుణాస్ పసిబిడ్డతో రోడ్డులో నడుస్తున్న దృశ్యం చూడగానే తన కళ్లు చెమర్చాయన్నారు. సినిమా ద్వారా మనకు వచ్చే పేరు, ప్రఖ్యాతలు వేరే ఎక్కడా లభించవన్నారు. నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ మాట్లాడుతూ సినిమా రూ.410 కోట్లతో రూపొందిస్తే అందులో రూ.10 కోట్లే కథకు ఖర్చుపెట్టి మిగిలింది నటులు తమ కోసమే ఖర్చు పెట్టిస్తున్నారని, అలా తమిళసినిమా నశించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలు బ్రహ్మాండంగా రూపొందుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయన్నారు. తమిళం, మలయాళం చిత్రాల కంటే తెలుగు సినిమానే అగ్రస్థానంలో ఉందని భారతీరాజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment