సాక్షి, హైదరాబాద్: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఫేక్ సింగర్ ప్రింట్స్‌తో ఆన్‌లైన్‌లో నగదును విత్ డ్రా చేసుకున్నారు. ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు భారీ స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. కేటుగాళ్లు ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో నగుదును విత్ డ్రా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సేల్ డీడ్‌ల ద్వారా ఫింగర్ ప్రింట్స్‌ను నిందితులు కాజేశారు. ఫ్రింగర్ ప్రింట్స్‌తో పాటుగా ఆధార్ నంబర్లను కూడా దొంగతనం చేశారు. ఈ క్రమంలో సేల్ డీడ్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకుని సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌ను నిందితులు తయారు చేశారు. ఇక, ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు భారీ స్కెచ్ వేశారు.
సిలికాన్ ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నెంబర్ ద్వారా కస్టమర్లకు తెలియకుండానే నగదును దోచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి సీఐడీ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజిత్ సాహ, అలం అనే ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే, వీరిద్దరికీ సహకరించిన కస్టమర్ సర్వీస్ అధికారులపై కూడా సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: భార్యపై అత్యాచారం చేశాడని!.. మైలార్‌దేవ్‌పల్లి మైనర్ రాజా కేసులో వీడిన మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment