
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ టిక్కెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించి నట్లు భారతీయ రైల్వే శాఖ సోమవారం తెలిపింది. యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఒక ఐడీపై ప్రస్తుతమున్న దాని కంటే ఎక్కువ టిక్కెట్లనే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
అయితే ఇక్కడ ఒక్క మెలిక పెట్టింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే తమ ఐడీపై నెలకు గరిష్టంగా 24 టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకున్న యూజర్లు ఇకపై నెలకు ఇక 24 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. అంతకుముందు ఈ పరిమితి 12 టిక్కెట్లు మాత్రమే. అయితే ఆధార్ లింక్ చేసుకోని యూజర్ మాత్రం 12 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. అంతకు ముందు ఈ పరిమితి కేవలం 6 టిక్కెట్లుగానే ఉన్న సంగతి తెలిసిందే.
ఐఆర్‌సీటీసీ- ఆధార్ లింకింగ్ ఎలా?
రైల్వేకు చెందిన అధికారిక వెబ్‌సైట్ irctc.co.inలో లాగిన్ అవ్వాలి.
అనంతరం మై అకౌంట్ ఆప్షన్‌లోకి వెళ్లి, LINK YOUR AADHAR అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
ఆ తరువాత సంబంధిత ముఖ్యమైన వివరాలను నమోదు చే యాల్సి ఉంటుంది.
వివరాలను నింపిన తరువాత , రిజిస్టర్ట్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
ఈ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేస్తే చాలు. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment