online ticket reservation
-
ఐఆర్సీటీసీ యూజర్లకు గుడ్ న్యూస్: డబుల్ ధమాకా!
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ టిక్కెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించి నట్లు భారతీయ రైల్వే శాఖ సోమవారం తెలిపింది. యాప్ లేదా వెబ్సైట్లో ఆన్లైన్లో టిక్కెట్ బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఒక ఐడీపై ప్రస్తుతమున్న దాని కంటే ఎక్కువ టిక్కెట్లనే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇక్కడ ఒక్క మెలిక పెట్టింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే తమ ఐడీపై నెలకు గరిష్టంగా 24 టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకున్న యూజర్లు ఇకపై నెలకు ఇక 24 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. అంతకుముందు ఈ పరిమితి 12 టిక్కెట్లు మాత్రమే. అయితే ఆధార్ లింక్ చేసుకోని యూజర్ మాత్రం 12 టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. అంతకు ముందు ఈ పరిమితి కేవలం 6 టిక్కెట్లుగానే ఉన్న సంగతి తెలిసిందే. ఐఆర్సీటీసీ- ఆధార్ లింకింగ్ ఎలా? రైల్వేకు చెందిన అధికారిక వెబ్సైట్ irctc.co.inలో లాగిన్ అవ్వాలి. అనంతరం మై అకౌంట్ ఆప్షన్‌లోకి వెళ్లి, LINK YOUR AADHAR అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత సంబంధిత ముఖ్యమైన వివరాలను నమోదు చే యాల్సి ఉంటుంది. వివరాలను నింపిన తరువాత , రిజిస్టర్ట్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేస్తే చాలు. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. -
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 15 రోజులపాటు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు(ఎస్ఏఎస్బీ) ప్రకటించింది. యాత్రకు అంకురార్పణ చేస్తూ ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రను కుదించారు. సాధువులు మినహా 55 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించరు. అనంత్‌నాగ్ జిల్లాలో పవిత్ర గుహలో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు కలిగి ఉండడం తప్పనిసరి. యాత్ర కోసం వచ్చే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మంచు శివలింగం దర్శనానికి సాధువులు మినహా మిగతా యాత్రికులంతా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పవిత్ర గుహలో 15 రోజులపాటు ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు. బాల్తాల్ మార్గంలోనే యాత్ర జరుగుతుంది. పహల్గామ్ మార్గంలో ఎవరినీ అనుమతించరు. బెంగళూరులో భక్తుల రాకకోసం ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. శనివారం సిటీలో ఓ ఆలయంలో విగ్రహాలపై రసాయనాలు చల్లి క్రిమిరహితం చేస్తున్న అర్చకులు -
రైల్వే బడ్జెట్ 2014-15 పై ప్రత్యేక చర్చ
-
కలల లోకాన్నైతే సృష్టించారు కానీ..
-
రైల్వే బడ్జెట్లో తెలుగు వారికి మొండి చెయ్యే!
-
బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్!
-
సంస్కరణల కూత
-
రైల్వే బడ్జెట్ మార్కెట్లను నష్టాల్లో పడేసింది
-
రైల్వే బడ్జెట్ : కూతెవరికి.. కోతెవరికి?!
-
సదానంద గౌడ కేంద్ర మంత్రా ? రాష్ట్ర మంత్రా ?
-
ఈసారీ తెలు'గోడు' వినలేదు!!
-
పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో రగడ
-
2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్
-
నిమిషానికి 7200 రైల్వే టికెట్లు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునీకరించనున్నామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. దీనివల్ల నిమిషానికి 7200 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లక్షమంది లాగిన్ అయినా సమస్యరాని విధంగా దీన్ని అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇక నుంచి రైలు, కోచ్, బెర్త్.. ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. రిటర్న్ జర్నీతో బుక్ చేసుకునేవారికి ఆటోమేటిగ్గా చార్జీ తగ్గేలా ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-పై సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని స్టేషన్లలో రిటైరింగ్ రూంలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేలా విస్తరిస్తామన్నారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని తెలిపారు. పార్కింగ్ కమ్ ప్లాట్ఫారం టికెట్లను ప్రవేశపెడతామని, దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.