
How To Link Aadhaar Pan Card With SBI Account Online: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్చి 31 నాటికి తమ పాన్ నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని తన ఖాతాదారులను కోరింది. ఒకవేళ మార్చి 31 నాటికి లింకు చేయడంలో విఫలమైతే వారు ఎస్‌బీఐ బ్యాంకింగ్ పూర్తి సేవలను వినియోగించుకోలేరు అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్‌కు పాన్ నంబర్‌ను లింక్ చేయాలని సూచించింది.
ఆధార్‌తో పాన్ నెంబర్ లింక్ చేయండి ఇలా..
- www.incometax.gov.inని ఓపెన్ చేయండి
- ‘క్విక్ లింక్స్’ హెడ్ కింద ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి.
- కొత్త పేజీలో పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
- ఇప్పుడు లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ నమోదు చేసి లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరిస్తే సరిపోతుంది.
(చదవండి: ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం)