How To Check Aadhaar Card Linking Status With Bank In Telugu - Sakshi
Sakshi News home page

మీ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింకు అయ్యిందో తెలుసుకోండిలా..!

Published Sun, Dec 26 2021 6:05 PM | Last Updated on Mon, Dec 27 2021 9:27 AM

How To Check Aadhaar Linking Status With Bank - Sakshi

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాల్సిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆధార్ కార్డు కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. 

ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త సేవలనును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ(https://uidai.gov.in/) వెబ్‌సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్:

  • ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీకు కనిపించే "చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
  • ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి.
  • ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
  • మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.

(చదవండి: ఫ్రీగా మీ క్రెడిట్‌ స్కోర్‌ను తెలుసుకోండి ఇలా..!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement