మన దేశంలో ఆధార్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. భారత దేశ పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ ఉచితంగా జారీ చేస్తుంది. ఇప్పుడు, మోసగాళ్లకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్తగా, ఆధార్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో ఆధార్ ను ఎలా ధృవీకరించాలో ట్వీట్ చేసింది. తదుపరి వివరాల కోసం uidai.gov.in ఆధార్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ చేయవచ్చు అని పేర్కొంది.
"ఏదైనా ఆధార్ ను ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా ధృవీకరించవచ్చు. ఆఫ్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, #Aadhaarపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఆన్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, లింక్(link: https://resident.uidai.gov.in/verify)లో 12 అంకెల ఆధార్ నమోదు చేయండి" అని ట్విటర్ లో పేర్కొంది.
మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా గుర్తించండి ఇలా?
- మొదట resident.uidai.gov.in/verify లింకు మీద క్లిక్ చేయాలి
- ఇచ్చిన స్థలంలో ఆధార్ నెంబరు, కాప్చాను నమోదు చేయాలి.
- తర్వాత 'Proceed to Verify' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే, మీ వయస్సు, జెండర్, రాష్ట్రం, మొబైల్ నెంబర్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేల అది నకిలీది అయితే ఈ వివరాలు కనిపించవు. పైన పేర్కొన్న పద్దతులు ద్వారా మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా తెలుసుకోవచ్చు.
#BewareOfFraudsters
— Aadhaar (@UIDAI) July 9, 2021
Any Aadhaar is verifiable online/offline. To verify offline, scan the QR code on #Aadhaar. To verify online, enter the 12-digit Aadhaar on the link: https://t.co/cEMwEa1cb4
You can also do it using the #mAadhaar app#AadhaarAwareness pic.twitter.com/5Z2enlYrTn
Comments
Please login to add a commentAdd a comment