న్యూఢిల్లీ: ఆధార్ రాజ్యాంగబద్ధమేనంటూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు పలు సూచనలు చేసిన నేపథ్యంలో వీటిని అమలుచేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటాను వినియోగించడాన్ని నియంత్రించడంతోపాటు కోర్టు చేసిన సూచనలు అమలుచేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని యూఐడీఏఐ అధికారులకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ఆదేశించారు. ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో అజయ్‌సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో విస్తృతాంశాలపై చర్చ జరిగిందని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘1,400 పేజీల తీర్పులో కోర్టు ప్రస్తావించిన చాలా అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయంకోరే ముందు యూఐడీఏఐ మార్పులు చేపట్టనుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment