
సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఎఐ) షాక్ ఇచ్చింది. యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉండనుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం, ధృవీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులోని చిరునామాలను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేసింది.దీంతో ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇకపై సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. అయితే ఆధార్ కార్డులో తప్పులును సరిచేసుకొనే అవకాశం యథావిధిగాఉంటుంది. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్‌ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.