
ప్రస్తుతం ప్రతి చిన్న పనికి ఎక్కువగా ఉపయోగిస్తున్న గుర్తింపు కార్డు ఏదైనా ఉందా అంటే? అది ఆధార్ అని చెప్పుకోవాలి. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, ప్రభుత్వ పథకాలు పొందలన్న, కరోనా పరీక్షలు జరపాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి అవసరం. అందుకే ప్రభుత్వం కూడా ఆధార్ కార్డును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని చూస్తుంది. ఒకవేల మీ ఆధార్ కార్డు అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన కార్డును ఎవరైనా వాడుతున్నారా?, ఎక్కడైనా ఉపయోగించారో లేదో తెలుసుకొనే అవకాశాన్ని యూఐడీఏఐ మనకు కల్పిస్తుంది. మరి అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ (https://uidai.gov.in/) పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లాలి.
- ఇప్పుడు "మై ఆధార్" సెక్షన్ లోకి వెళ్లి "ఆధార్ సర్వీసెస్" సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇక ఆధార్ సర్విస్ సెక్షన్ లో 8వ వరుసలో కనిపించే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో ఎంచుకొని, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీకు ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారో వివరాలు వస్తాయి.
- ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు చేయాల్సి ఉంటుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment