మీకు 5 సంవత్సరాల వయస్సు నిండిన బాబు/పాప ఉందా? గతంలోనే మీరు పిల్లల కోసం బాల ఆధార్ కార్డు గనుక తీసుకుంటే మీకు ఒక ముఖ్య గమనిక. యుఐడీఏఐ భారతదేశానికి చెందిన చిన్న పిల్లల నుంచి వృద్దులకు ఆధార్ సంబందిత సేవలను అందిస్తుంది. మన దేశంలో ప్రతి చిన్న పిల్లలు తప్పినిసరిగా బాల ఆధార్ తీసుకోవాలి. అయితే, ఈ బాల ఆధార్ తీసుకునే సమయంలో పిల్లల ఫోటో మాత్రమే తీసుకుంటారు.
ఆ సమయంలో బయోమెట్రిక్స్ వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు బాల్ ఆధార్ కార్డుతో లింకు చేయబడవు. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్(ఐరిస్ స్కాన్, వేలిముద్రలు)ని ఆధార్ కార్డులో తప్పనిసరిగా నవీకరించాలి. తాజాగా మరోసారి యుఐడీఏఐ 5 సంవత్సరాల నిండిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ తప్పనిసరిగా అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందని ట్వీట్ ద్వారా తెలిపింది.
#AadhaarChildEnrolment
— Aadhaar (@UIDAI) July 26, 2021
In #Aadhaar, fingerprints and iris scans are not captured while enrolling the children below 5 years of age, only a photograph is taken. Once the child attains the age of 5, biometrics need to be updated mandatorily. #AadhaarEnrolment #BiometricUpdate pic.twitter.com/Fn6mHSW1Ui
Comments
Please login to add a commentAdd a comment