mAadhaar
-
మీ ఆధార్ ని ఎవరైనా చూశారో లేదో తెలుసుకోండిలా..?
ప్రస్తుతం ప్రతి చిన్న పనికి కూడా ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నాము. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, ప్రభుత్వ పథకాలు పొందలన్న, ఇలా ఏవైనా ఇతరత్ర పని కోసం ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం కూడా ఆధార్ కార్డును జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రజలను కోరుతుంది. ముక్కు మొహం తెలియని అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి మన ఆధార్ వివరాలు వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్ ను ఎవరైనా ఎక్కడైనా ఉపయోగించారో లేదో తెలుసుకొనే అవకాశాన్ని యూఐడీఏఐ మనకు కల్పిస్తుంది. అది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ https://uidai.gov.in/ వెబ్ సైటు ఓపెన్ చేయాలి మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి ఆధార్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆనంతరం ఆధార్ సర్విస్ సెక్షన్ లో 8వ వరుసలో కనిపించే ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి ఇప్పుడు ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఎప్పటి నుంచి ఆధార్ హిస్టరీ కావాలో ఎంచుకొని, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి ఇప్పుడు మీకు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఆధార్ ఉపయోగించారో వివరాలు కనిపిస్తాయి ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కు లింకు చేయాల్సి ఉంటుంది చదవండి: ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా! తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! -
2నిముషాల్లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి!
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ప్రతీ చోటా అవసరం అవుతోంది. మరి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి అవసరం అవుతోంది. ఇక సిమ్ కార్డులు తీసుకోవడానికి, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి అందజేయాల్సిందే. కానీ ప్రతిసారి ఆధార్ కార్డును ఎప్పుడూ మన వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఎప్పుడైనా అత్యవసర సమయంలో మీ దగ్గర ఆధార్ కార్డు లేకుంటే ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం యూఐడీఏఐ కల్పించింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్లోడ్ 2నిమిషాలలో చేసుకోవచ్చు. ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం: ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐలో రిజిస్టరై ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆధార్ నెంబర్, ఎన్ రోల్ మెంట్ నెంబర్, వర్చ్యువల్ ఐడి ఉంటే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై ఆధార్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఆధ్వర్యంలో ఎంఆధార్ యాప్‌ను 2017లో రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు తమ ఆధార్ డేటా తస్కరించ ఉండటానికి ఆధార్ ప్రొఫైల్ కి లాక్ వేయవచ్చు. తాజాగా మరో ఫీచర్ ను ఎంఆధార్ వినియోగదారుల కోసం యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎంఆధార్ యాప్‌లో మరో ఐదుగురి ఆధార్ కార్డు ప్రొఫైల్‌లను జత చేసుకునే వెసులుబాటు కల్పించింది. యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఇంతకముందు ఎంఆధార్ యాప్‌లో గరిష్టంగా మూడు ప్రొఫైల్‌లను చేర్చే అవకాశం ఉండేది. ఇప్పడు ఐదు ప్రొఫైల్ జత చేసుకోవచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఏదైనా సేవను ఆధార్ లాక్/అన్‌లాక్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, విఐడి జెనరేటర్, ఇకెవైసి మొదలైన వాటిని ఎంఆధార్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. మీరు ప్రతి ప్రొఫైల్‌ను జతచేయాలి అనుకున్నప్పుడు ఆధార్ నెంబర్ ధృవీకరించడం కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ యాప్‌లో వినియోగదారుల పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నంబర్ లింక్‌లను కలిగి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వారి ప్రొఫైల్ డేటాను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. You can add up to 5 Aadhaar profiles in your #mAadhaar app. OTP for authentication is sent to the registered mobile number of the Aadhaar holder. Download and install the #NewmAadhaarApp from: https://t.co/62MEOf8J3P (Android) https://t.co/GkwPFzM9eq (iOS) pic.twitter.com/gapv443q72 — Aadhaar (@UIDAI) February 12, 2021 చదవండి: ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక
న్యూఢిల్లీ: ఆధార్ కార్డును రూపొందించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియ(యుఐడిఎఐ) పలు రకాల సేవలను వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు నవీకరిస్తుంది. తాజాగా పాత ఎంఆధార్ యాప్ ను మొబైల్ ఫోన్ నుంచి తొలగించి కొత్తగా తీసుకొచ్చిన యాప్ ను డౌన్లొడ్ చేసుకోవాలని వినియోగదారులను కోరింది. ఇటీవల ఎంఆధార్ యాప్ ఫీచర్స్‌లో పలు మార్పుల్ని చేసింది యుఐడిఎ. అందుకే సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు వెంటనే పాత యాప్ డిలిట్ చేసి ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాలని కోరుతోంది. కొత్త వెర్షన్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని ట్విటర్ ద్వారా వెల్లడించింది. 13 భాషల్లో అందుబాటులో ఉన్న కొత్త యాప్ లో 35 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఎంఆధార్ ద్వారా ఆధార్ డౌన్లోడ్, అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ వంటి ఇతర సేవలను ఆన్లైన్ సేవలు పొందవచ్చు. చదవండి: మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త! ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి -
ఐఫోన్ యూజర్లకు యూఐడీఏఐ మెసేజ్
న్యూఢిల్లీ : దేశంలో డిజిటైజేషన్ పెంచడానికి ఆధార్ ఏజెన్సీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరు నెలల క్రితం 'ఎంఆధార్' యాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో లాంచ్ చేసిన ఈ యాప్‌ను ఆధార్ ఏజెన్సీ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్‌ను త్వరలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతుంది. ఎంఆధార్ యాప్ ఐఓఎస్ వెర్షన్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషన్ పాండే తెలిపారు. త్వరలోనే ఈ యాప్‌ను ఐఓఎస్ యూజర్లకు లాంచ్ చేయబోతున్నట్టు పాండే ఓ షార్ట్ వీడియోలో పేర్కొన్నారు. అయితే లాంచింగ్ తేదీని మాత్రం పాండే తెలుపలేదు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పాండే ఈ వీడియోను విడుదల చేశారు. ఆధార్ డేటా దొంగతనంపై ఇటీవల వస్తున్న రిపోర్టు, ఆధార్ యాప్ భద్రతపై కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చారు. ఆండ్రాయిడ్ వెర్షన్‌కు అందించే ఫీచర్లనే ఐఓఎస్ వెర్షన్‌కు అందించనున్నారు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేందుకు ఆధార్‌తో మొబైల్ నెంబర్‌ను రిజిస్ట్రర్ చేయాల్సి ఉంటుంది. ఎంఆధార్‌ను అపరిచితులు ఓపెన్ చేయకుండా బయోమెట్రిక్ అథంటికేషన్‌ను ఏర్పాటుచేశారు. బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవడానికి యూజర్లకు ఎంఆధార్ యాప్ సహకరించనుంది. -
మొబైల్లోనే మీ ఆధార్
ప్రస్తుతం ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారమవుతోంది. ఎక్కడికి పోయినా మొదట దీన్నే అడుగుతున్నారు. దీంతో కచ్చితంగా మన పర్స్‌లో ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధార్‌ను మర్చిపోయి, ఏదైనా పనిమీద వెళ్తే, అక్కడ పడే తిప్పలు వర్ణనాతీతం. అయితే దీనికి పరిష్కారం వచ్చేసింది. ఆధార్ కార్డును పర్స్‌లో కచ్చితంగా పట్టుకెళ్లాల్సినవసరం లేకుండా.. ఫోన్లోనే దీన్ని తీసుకెళ్లేలా యూనిక్ ఐడెంటిఫికేసన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఎంఆధార్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. దీంతో మొబైల్లోనే ఆధార్ కార్డును తీసుకెళ్లవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ యాప్ ఆధార్ ప్రొఫైల్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఈ యాప్ ద్వారా లింక్ అయ్యే ఆధార్ యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు. దీంతో మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయి. క్విక్ రెస్పాన్స్ కోడ్‌తో అప్డేటెడ్ ఆధార్ ప్రొఫైల్‌ను షేర్ చేయడానికి, చూడటానికి ఇది ఉపయోగపడుతోంది. ఈకైవైసీ వివరాలను టెలికాం కంపెనీల వంటి సర్వీసు ప్రొవైడర్లకు షేర్ చేయవచ్చు. ఎంఆధార్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ ద్వారానే ఇది సాధ్యపడుతోంది. ఆధార్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదని తెలిసిందే. పాన్ కార్డును కూడా ఆధార్‌తో లింక్చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది. బ్యాంకు అకౌంట్లకు ఈ ఏడాది చివరికల్లా ఆధార్లను లింక్ చేసుకోవాలని, లేనిపక్షంలో ఆ అకౌంట్లు బ్లాక్ అవుతాయిన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఈ యాప్‌ను తీసుకురావడం విశేషం.