
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రవేశించడానికి ఇకపై మొబైల్ ఆధార్‌ను చూపిస్తే సరిపోతుందని పౌర విమానయాన భద్రతా సంస్థ తెలిపింది. ఎయిర్‌పోర్టులో ప్రవేశానికి పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, ఆధార్ లేదా మొబైల్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి సమర్పిస్తే చాలంది.
పైన పేర్కొన్న వాటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంకు జారీచేసిన పాస్ పుస్తకం లేదా పెన్షన్ కార్డు, వైకల్య గుర్తింపు కార్డు, కేంద్ర/రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే ఐడీ కార్డులు, ప్రభుత్వ రంగ, స్థానిక, ప్రైవేటు సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులను స్వీకరిస్తామని తెలిపింది. దివ్యాంగులు వైకల్య ఫొటో గుర్తింపు కార్డును లేదా మెడికల్ సర్టిఫికెట్‌ను విమానాశ్రయంలోకి వచ్చేముందు సమర్పించాల్సి ఉంటుంది. చివరికి ఇవేవీ లేకున్నా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్–1 గెజిటెడ్ అధికారి జారీచేసిన గుర్తింపు కార్డును అంగీకరిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment