ఓటర్ ఐడీ,ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేసే సమయాన్ని ఏప్రిల్1, 2023 నుంచి మార్చి 31,2024 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టం న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Law and Justice) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది జూన్ 17న న్యాయ మంత్రిత్వ శాఖ ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్‌ను ఏప్రిల్ 1, 2023 లోపు లింక్ చేయాలని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల సంఘం ఆగస్టు 1 న నమోదైన ఓటర్ ఐడిలతో ఆధార్ కార్డ్ లింక్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఓటర్ ఐడీకి ఆధార్‌ని లింక్ చేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా, ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం ద్వారా బోగస్ ఓట్లను గుర్తించొచ్చు. అంటే ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే.. అవి రద్దు అవుతాయి. దీని వల్ల పారదర్శకత వస్తుందని కేంద్రం ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Centre extends the deadline for linking Aadhaar number with voter ID to March 31, 2024 from April 1, 2023.#Aadhaar pic.twitter.com/YRDseimiPp
— Live Law (@LiveLawIndia) March 22, 2023
Comments
Please login to add a commentAdd a comment