హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో రోజూ 30 కేంద్రాల ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద సాయం చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
► బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో ఈ నెల 5వ తేదీ నాటికి 50 వేల అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు.
► జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నాటికి 3.80 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
► వచి్చన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా 60 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు.
► వీరికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోనే దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.
► ఇప్పుడు ఉన్న డీటీపీ ఆపరేటర్లు సరిపోకపోతే ప్రైవేటు వాళ్లను నియమించాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.
► పలు పథకాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారనే మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు.
► వచ్చేనెల నుంచి మహిళలకు రూ. 2,500లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
► అధికారులు అర్జీల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు.. లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేస్తారు.. దీనికి ప్రాతిపదిక ఏమిటీ.. ఏయే అర్హతలు చూస్తారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుల్లో దేనిని పరిగణలోనికి తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
► దరఖాస్తు చేసుకున్నవారంతా తమకు
లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దరఖాస్తులు 80 శాతం తెల్లరేషన్‌కార్డు కోసమే పెట్టుకోగా, ఆ తర్వాత స్థానం రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం
పెట్టుకున్నారు.
► అయితే తెల్ల రేషన్‌కార్డు లేనివారు తీవ్ర
ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే తమకు పథకాలు అందవేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది.
గడువులోగా నమోదు పూర్తిచేస్తాం
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం డీటీపీలకు జోనల్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలు ఇచి్చన దరఖాస్తులను ఎలా నమోదు చేయాలనే విషయంపై అవగాహన పెంచుకుంటారు. దానికి సంబంధించిన పోర్టల్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచే నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెలత 17వ తేదీ లోపు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా నిరీ్ణత సమయంలో పూర్తిచేస్తాం. ఇందుకోసం రెండు రోజుల నుంచే పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న ఆపరేటర్లతో పాటు కొత్తగా వచి్చన వారితో నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడతాం. – ప్రశాంతి, డీసీ, జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్
Comments
Please login to add a commentAdd a comment