Pan Aadhaar Linking Deadline: Govt Extended Last Date To 3 Months, Check Details - Sakshi
Sakshi News home page

మరోసారి పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు

Published Fri, Jun 25 2021 7:57 PM | Last Updated on Sat, Jun 26 2021 9:55 AM

PAN-Aadhaar Linking Deadline Extended by 3 Months To 30 Sept - Sakshi

పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో గడువును మూడు నెలలు సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు జూన్‌ 30తో దగ్గర పడుతున్న వేళ కేంద్రం ఈ కీలక ప్రకటన చేసింది. మొదట పాన్-ఆధార్ లింకు గడువును మార్చి 31 పేర్కొన్నారు. తర్వాత కూడా కరోనా మహమ్మరి వల్లనే జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి మూడు నెలల పాటు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం ఒక సవరణను కూడా చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్యం రుసుము కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌-ఆధార్‌ లింకింగ్  పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్‌ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

అలాగే, కొవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువును మరో రెండు నెలలు (ఆగస్టు 31 వరకు) పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే నిబందనల ప్రకారం ‎మొదటిసారి ఇల్లును కొనుగోలు చేస్తే దానిపై పెట్టె‎‎ పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ గడువును జూన్ 30 నుంచి మరో 3 నెలలు పొడగించింది.

చదవండి: పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement