పాన్‌–ఆధార్‌ లింక్‌ చేశారా? | Hurry Up Lets Link Your Aadhaar With Pan Card | Sakshi
Sakshi News home page

పాన్‌–ఆధార్‌ లింక్‌ చేశారా?

Published Sat, Sep 28 2019 11:05 AM | Last Updated on Sat, Sep 28 2019 11:11 AM

Hurry Up Lets Link Your Aadhaar With Pan Card - Sakshi

సాక్షి, ప్రకాశం: నేడు ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఏ లావాదేవీలకైనా పాన్‌కార్డు నంబర్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ ప్రకారం పాన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌కు ఆధార్‌ నంబర్‌ కూడా అవసరం. పాన్‌కార్డు లేనివారు ఆధార్‌తో ఐటీ రిటరŠన్స్‌ దాఖలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆధార్‌ సంఖ్యను పాన్‌కార్డుతో అనుసంధానం ఆన్‌లైన్‌లోనూ, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చేసుకోవచ్చు.\

లాగిన్‌ అయ్యేది ఇలా..
పన్ను చెల్లింపుదారులు ఇన్‌కం ట్యాక్స్‌ ఇ–ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. ఇదివరకే యూజర్‌ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఇ–ఫైలింగ్‌ పోర్టర్‌లో లాగిన్‌ కావచ్చు. లాగిన్‌ అయ్యేందుకు గతంలో క్రియేట్‌ చేసుకున్న యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్, కోడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో ఆధార్, పాన్‌ సంఖ్యల లింక్‌ వివరాలు తెలుసుకోవచ్చు.

కొత్తగా లింక్‌ ఇలా..
ఆదాయపన్ను శాఖ ఇ–ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్‌ అయి ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ముఖచిత్రంలో ఎడమ భాగంలో లింక్‌ ఆధార్‌ న్యూ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. ఒక విండో ఓపెన్‌ అవుతుంది. అక్కడ పాన్‌కార్డు సంఖ్య, ఆధార్‌కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్‌ చెక్‌ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. వ్యాలిడేషన్‌ పూర్తయిన తర్వాత పాన్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం జరుగుతుంది. వివరాలన్నీ సరిపోతేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయితే మీకు సమాచారం అందుతుంది. 

ఎస్‌ఎంఎస్‌ ద్వారా..
యూఐడీపీఏఎస్‌ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి స్పేస్‌ ఇచ్చి పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి 567678కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. ఆధార్‌కార్డుతో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌తోనే ఎస్‌ఎంఎస్‌ పంపాల్సి ఉంటుంది. 

అనుసంధానం ఎందుకు..
ఆదాయపన్ను శాఖ రిటర్న్స్‌ దాఖలు చేసినప్పుడు మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ మీ ఆధార్‌ అనుసంధానం అయిన సెల్‌ నంబర్‌కు ఇక నుంచి వస్తుంది. అలాగే ఆ శాఖ ఇ–వెరిఫికేషన్‌ మరింత సులువవుతుంది. పాన్‌తో పాటు ఆధార్‌ అనుసంధానం చేయని పక్షంలో సెప్టంబర్‌ 30 తర్వాత పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆదాయపన్ను రిటర్నులు చేసేవారు ఆధార్‌ను పాన్‌కు అనుసంధానించడం మంచిది. ఇన్‌కం ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌ అనుసంధానం జరిగి ఉంటే వీరు ఐటీఆర్‌–5ను ప్రింట్‌ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement